ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘రైతులకు న్యాయం చేయాలి’

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:32 AM

పాణ్యం మండలం ఆలమూరు నుంచి కందికాయ పల్లె, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 167 హైవే రోడ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు భూ సేకరణ చట్టం అమలు చేసి, రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు.

ధర్నాలో పాల్గొన్న సంఘాల నాయకులు, రైతులు

నంద్యాల (కల్చరల్‌), ఫిబ్రవరి 29: పాణ్యం మండలం ఆలమూరు నుంచి కందికాయ పల్లె, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 167 హైవే రోడ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు భూ సేకరణ చట్టం అమలు చేసి, రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. గురువారం నంద్యాల కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ బాధిత రైతులకు అండగా వుంటామన్నారు. అధికారులు రైతులతో చర్చించి పరిష్కారం చేయని పక్షంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలను సమీకరించి కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని అధికారులను హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయకపోతే సోలార్‌ పనులను అడ్డుకుంటామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆఫీసు కార్యాలయ ఏవోకు రైతులు వ్యక్తిగత అర్జీలు, వినతి పత్రాలు సమర్పించారు. ఆలమూరు, కందికాయపల్లె, పిన్నాపురం, కొత్తపల్లి మండలం సింగరాజు పల్లె, బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె, ఎ.కోడూరు, బండిఆత్మకూరు, బిల్లలాపురం, చింతకుంట తదితర గ్రామాలనుంచి రైతులు, మహిళలు, రైతు సంఘం నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:32 AM

Advertising
Advertising