వివేకా కేసులో జగన్‌ను విచారించాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:21 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్ చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు
కర్నూలు(అర్బన్), మార్చి 2: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ జగన్ రాజకీయ లబ్ధి కోసం వారి ముఠానే వివేకానందరెడ్డి హత మార్చిం దని, గొడ్డలి పోటుతోనే బాబాయ్ చనిపో యారని అంత కచ్చితంగా జగన్ ఎలా చెప్పగలరని ఆనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ చేయాలని సునీ తమ్మ కోరితే జగన్ రెడ్డి ఎందుకు ఆపారని, మొదట సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్ తర్వాత వద్దు అనడం వెనుక ఉన్న కారణాలను ప్రజలకు తెలియ జెప్పాలన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌రెడ్డి సీబీఐ విచారణ పిటి షన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. బాబాయ్ హత్య చేసిన అబ్బాయిని జగన్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్య మేంటని, సీఎం అయిన తర్వాత కేసు ఎందుకు పురోగతి కాలేదని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి ఎలా చనిపోయారో జగన్‌కు తెలుసు కానీ ఎందుకు దాచాలను కుంటున్నారు. ముఖ్య మంత్రిగా కొనసాగే అర్హత జగన్‌కు లేదన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయ లేని జగన్ రాష్ట్రంలోని అక్కా, చెల్లెల్లకు ఏమీ న్యాయం చేస్తారు. విలువలు గురించి పదేపదే మాట్లాడే వైసీపీ నాయకులు ఇప్పటికైనా విలువల గురించి మాట్లాడటం మానుకోవాలన్నారు. జగన్ చెప్పినట్లు పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం కాదు.. హంతకులకు, రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధమని అన్నారు. సునీతమ్మ చేస్తున్న పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 12:21 AM