ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భీముని కొలనులో అపశ్రుతి

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:32 AM

శ్రీశైలానికి కాలి నడకన బయలు దేరిన ఓ మహిళ భక్తురాలికి గురువారం భీముని కొలనులో అపశ్రుతి చోటు చేసుకుంది.

కొండ దిగే క్రమంలో కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

ఆత్మకూరు, మార్చి 7: శ్రీశైలానికి కాలి నడకన బయలు దేరిన ఓ మహిళ భక్తురాలికి గురువారం భీముని కొలనులో అపశ్రుతి చోటు చేసుకుంది. పెచ్చేరువు నుంచి భీమునికొలనుకు చేరుకున్న ఓ మహిళ భక్తురాలు భీముని కొలను దిగే క్రమంలో కింద పడి పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమె భీముని కొలను నుంచి కైలాస ద్వారానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె వెంట వచ్చిన సహచరులు కైలాస ద్వారానికి చేరుకుని అటవీ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు భీముని కొలనుకు చేరుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద దుప్పటితో ఏర్పాటు చేసిన డోలి ద్వారా కైలాస ద్వారానికి మోసుకుంటూ తీసుకు వచ్చారు. అక్కడికి చేరిన బాధిత మహిళను 108 అంబులెన్సు ద్వారా శ్రీశైల దేవస్థానంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడి వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. బాధిత మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 08 , 2024 | 12:33 AM

Advertising
Advertising