ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొత్త విధానంతో అవస్థలు: ఎస్టీయూ

ABN, Publish Date - Feb 16 , 2024 | 12:13 AM

ఎఫ్‌ఏ-3 మార్కుల ఆన్‌లైన్‌ నమోదు కొత్త విధానం వల్ల అవస్థలు తప్పడం లేదని, పాత విధానంలోనే చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

నంద్యాల (నూనెపల్లె), ఫిబ్రవరి 15: ఎఫ్‌ఏ-3 మార్కుల ఆన్‌లైన్‌ నమోదు కొత్త విధానం వల్ల అవస్థలు తప్పడం లేదని, పాత విధానంలోనే చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నంద్యాలలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీజీ లాకర్‌ విధానంలో ఉపాధ్యాయుడిని ప్రయాసకు గురిచేస్తూ మార్కుల నమోదు చేయించడం సరైన విధానం కాదన్నారు. ఎఫ్‌ఏ-3 మార్కుల నమోదుకు డీజీ లాకర్‌కు సంబంధం చేయడం ఫోన్‌ నెంబర్లు అనుసంధానించడం చాలా ఇబ్బందికర విషయమని, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లు ఉండవనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ స్పందించి పాత విధానంలోనే నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మౌలాలి, అజాంబేగ్‌, శ్రీనివాసరావు, దేవేందర్‌రెడ్డి, సోమయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 12:13 AM

Advertising
Advertising