రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం పిరికి చర్య
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:02 AM
రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం పిరికి పంద చర్య అని టీడీపీ జిల్లా అధ్య క్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు
కర్నూలు(అర్బన్), ఫిబ్రవరి 16: రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం పిరికి పంద చర్య అని టీడీపీ జిల్లా అధ్య క్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో ప్రతిపక్ష నాయకు డుగా ఉన్న సమయంలో సాక్షాత్తు శాసన సభలో అమరావతి రాజఽధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని, వీలైనంత ఎక్కువ భూమిని సేకరించి, అత్యున్నతంగా రాజధాని నిర్మాణం చేపట్టాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి సూచన చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మూ డు రాజధానుల డ్రామాలకు తెరతీశారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 35 వేల ఎకరాల భూమిని ప్రభు త్వానికి ఇచ్చారని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు.
Updated Date - Feb 17 , 2024 | 01:02 AM