పల్స్ పోలియోకు విశేష స్పందన
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:52 PM
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై. ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
జిల్లాలో 99.64 శాతం
కర్నూలు(హాస్పిటల్), మార్చి 4: జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై. ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లాలో 99.64 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,48,071 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, రెండో రోజు 3,41,681 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన చిన్నారులకు 5, 6 తేదీల్లో చుక్కలు వేస్తామని తెలిపారు. కర్నూలు అర్బన్‌లో ఈ నెల 6న ప్రత్యేకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కర్నూలు మండలంలోని బి. తాండ్రపాడు, ఓర్వకల్లు మండలాల్లోని కాల్వబుగ్గ, హుశేనాపురం గ్రామాల్లో జరుగుతున్న డోర్ టూ డోర్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన సౌత్ ఇండియా రీజియన్ టీమ్ లీడర్ సందీప్ పటేల్ సందర్శించారు. ఎన్ని బూత్‌లు ఏర్పాటు చేసిందీ, ఎంత మందికి చుక్కలు వేసిందీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:52 PM