ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:38 AM

టీడీపీ, జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మేనిఫెస్టోలో భాగమైన బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.

నగదును అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, ఫిబ్రవరి 29: టీడీపీ, జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మేనిఫెస్టోలో భాగమైన బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరు ఎంఎం గార్డెన్‌లో శ్రీశైలం నియోజకవర్గంలోని ఆయా మండలాల క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయనున్నట్లు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్ని నిలిపివేస్తారని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అదేక్రమంలో టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే ఆయా కుటుంబాలకు కలిగే మేలు గురించి వివరించాలని సూచించారు. అనంతరం బూత్‌ కన్వీనర్లకు బాబు సూపర్‌ సిక్స్‌ కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ బన్నూరు రామలింగారెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, కంచర్ల సురేష్‌, ఉల్లి మధు, నరసింహారెడ్డి, బెంజుమెన్‌, శేషిరెడ్డి, నాయకులు కలిముల్లా, శ్రీనివాసరెడ్డి, నాగూర్‌ఖాన్‌, మల్లేశ్వరరెడ్డి, అబ్దుల్లాపురం బాషా, మనోహర్‌, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు తదితరులు ఉన్నారు.

మహానంది: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో గుండెపోటుకు గురై మృతి చెందిన మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన కార్యకర్త మద్దిలేటి కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థి సాయాన్ని అందజేశారు. నారా భువనేశ్వరి పంపించిన ఈ ఆర్థిక సాయాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అందచేశారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో జరిగిన టీడీపీ సమావేశంలో వేదికపై మద్దిలేటి భార్య అనంతమ్మకు అందజేశారు. నాయకులు కంచెర్ల శివ, వేమూరి కేశవరావు, గుద్దేటి నాగరాజు, మారెడ్డి సుబ్రమాణ్యం, శివలు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:38 AM

Advertising
Advertising