డ్రంకెన్ డ్రైవ్‌లో 11 కేసులు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:23 AM
నగర శివారులో సుంకేసుల రోడ్డులో సంజీవని హాస్పిటల్ వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు.
కర్నూలు, మార్చి 2: నగర శివారులో సుంకేసుల రోడ్డులో సంజీవని హాస్పిటల్ వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడు ద్విచక్ర వాహనదారులను, ముగ్గురు కారు డ్రైవర్లు, ఒక ఆటో డ్రైవర్ పోలీసులకు చిక్కారు. వీరి వాహనాలు సీజ్ చేసి వీరిపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వాహనదారులను సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ గౌతమి తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 12:23 AM