దగాపడిన దళితుడా మేలుకో
ABN, Publish Date - Mar 10 , 2024 | 01:41 AM
‘‘వైసీపీ పాలనలో దళితులు దగా పడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన నిధులు అందలేదు. ఎస్సీ లకు సబ్సిడీ రుణాలు ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన సీఎం జగన్ దగా చేశారు. ఎస్సీలందరూ సంఘటితమై జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపాలి.’’ అని టీడీపీ-జనసేన మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
దళిత శంఖారావంలో కొల్లు రవీంద్ర పిలుపు
మచిలీపట్నం టౌన్, మార్చి 9: ‘‘వైసీపీ పాలనలో దళితులు దగా పడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన నిధులు అందలేదు. ఎస్సీ లకు సబ్సిడీ రుణాలు ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన సీఎం జగన్ దగా చేశారు. ఎస్సీలందరూ సంఘటితమై జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపాలి.’’ అని టీడీపీ-జనసేన మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మచిలీపట్నంలో నిర్వహించిన దళిత శంఖారావం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో దళితులను కిరాతకంగా హింసించారని, దళిత శక్తి ఏమిటో ప్రభుత్వానికి చూపించే తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించిన ఘనత టీడీపీదేనన్నారు. దళితులను చంద్రబాబు సంపద సృష్టించడంలో దళి తులను భాగస్వామ్యం చేశారని, బాలయోగిని లోక్‌సభలో స్పీకర్ చేశా రని, టీడీపీ-జనసేన తిరువూరు అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. పేర్ని నాని మచిలీపట్నాన్ని తన సొంత ఆదాయపు వనరుగా మార్చుకు న్నారని, కొల్లు రవీంద్రపై హత్య కేసు పెట్టించాడని ఆరోపించారు. చంద్ర బాబు ఎస్సీల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలిచ్చేవారని టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. టీడీపీ-జనసేన విజయానికి అందరూ కృషి చేయాలని జనసేన మచిలీపట్నం ఇన్‌చార్జి బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. బురకా బాలాజీ, ఊసా వెంకటేశ్వరరావు, బొడ్డు నాగరాజు, నీలం రామకృష్ణ, చిట్టూరి యువరాజు, దేవరపల్లి అనిత, సాతులూరి నాంచారయ్య, చిన్నం సురేష్, మాచవరపు ఆదినారాయణ, చిన్నం శేఖర్, లింగం విజయ్, గుమ్మడి విద్యాసాగర్, మాదివాడ రాము, వంపుగడల చౌదరి, గడ్డం రాజు, బండి కరుణాకర్ పాల్గొన్నారు.
Updated Date - Mar 10 , 2024 | 01:41 AM