వీరమ్మ తిరునాళ్లకు భక్తుల రద్దీ
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:40 AM
వీరమ్మతల్లి తిరునాళ్లకు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. మరో రెండు రోజుల్లో తిరునాళ్లు ముగియనున్న నేపథ్యంలో మొక్కు బడి తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. చలువ కావిడిలు, పసుపు కుం కుమ, చీర సారె, గొర్రె పొటేళ్లతో డప్పువా యిద్యాల నడుమ సందడిగా వచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి అ మ్మ వారిని దర్శించుకుంటున్నారు. తిరునాళ్లలో చివరి ఆదివారం రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుం దని అంచనా కాగా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తు న్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు తరలి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారని భావిస్తున్నారు.
ఫరేపటితో ముగియనున్న తిరునాళ్ల
ఫమొక్కులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
ఉయ్యూరు, మార్చి 2 : వీరమ్మతల్లి తిరునాళ్లకు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. మరో రెండు రోజుల్లో తిరునాళ్లు ముగియనున్న నేపథ్యంలో మొక్కు బడి తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. చలువ కావిడిలు, పసుపు కుం కుమ, చీర సారె, గొర్రె పొటేళ్లతో డప్పువా యిద్యాల నడుమ సందడిగా వచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి అ మ్మ వారిని దర్శించుకుంటున్నారు. తిరునాళ్లలో చివరి ఆదివారం రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుం దని అంచనా కాగా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తు న్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు తరలి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారని భావిస్తున్నారు.
భారీ అన్న సమారాధన
వీరమ్మ తిరునాళ్ల పురస్కరించుకుని ఆలయ కమి టీ ఆధ్వర్యంలో శనివారం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన చేశారు. తిరునాళ్లకు పలు ప్రాం తాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరాగా వారికి అన్న సమారాధన చేసి సేవలందించారు. దూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులతో పాటు ఉయ్యూరు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. పలు సంస్థలు, వ్యక్తులు పాల్గొని సేవలందించారు.
డీజేల మోత!
గుండెలదిరేలా డీజేలు, మైకుల మోత, మితిమీరిన శబ్ధకాలుష్యంతో ఉయ్యూరులో ప్రజలు తీవ్ర అసౌక ర్యానికి గురవుతున్నారు. వీరమ్మ తిరునాళ్ల సందర్భం గా వ్యానులు, ఆటోల నిండా రణగొణ ధ్వనులు చేస్తూ చెవులు పగిలే శబ్ధాలతో శబ్ధ కాలుష్యం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు విన వస్తున్నాయి. తిరునాళ్లకు వెళ్లే వారు డీజేలు, పదుల సంఖ్యలో వ్యానులకు అమర్ఛి, కీబోర్డు ధ్వనులతో వెళుతూ, రోడ్డుపై నడిచేందుకు వీలు లేకుండా చేస్తూ పగలు, రాత్రులు అనకుండా అర్ధరాత్రి వరకు విపరీ తమైన శబ్ధాలు చేస్తుండటంతో ఇళ్లలో నిద్రించే అవ కాశం లేకుండా చేయడమే కాక, విపరీతమైన మోత తో భవనాలు సైతం అదిరేలా చేస్తున్నారు. డీజేలు, మైకులమోతతో హృద్రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
అమలుకాని డీఎస్పీ ఆదేశాలు
తిరునాళ్లకు మితిమీరి మైకులు, డీజేలతో వెళ్లేవారిని అనుమతించవద్దని గన్నవరం డీఎస్పీ బీఆర్ జయసూ ర్య పట్టణ పోలీసులకు రెండు రోజుల క్రితం ఆదేలి చ్చారు. ఉయ్యూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనకు డీజేలా బాధ, ప్రజల ఇబ్బందులను స్థానికు లు మొరపెట్టుకున్నారు. డీజేల మోతతో నాలుగు సం వత్సరాల క్రితం ప్రధాన సెటర్‌లో ఓ హోటల్ ముం దు నిలబడి ఉన్న వ్యక్తి కుప్పకూలి మరణించిన సంఘటనలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డీజేలు పెట్టుకుని తిరునాళ్లకు వెళ్లేందుకు అనుమతిం చవద్దని, డీజేలు అద్దెకిచ్చేవారికి నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. సాక్షాత్తు డీఎస్పీ ఆదేశాలు సైతం అమలుకు నోచుకోపోవడం ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:40 AM