ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ టార్గెట్‌ యువ!

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:14 AM

యువ ఓటర్లపై తెలుగుదేశం దృష్టి సారించింది. మొదటి సారి ఓటు వేయబోతున్న యువతను లక్ష్యంగా చేసుకుంది. వీరి కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. యువ ఓటర్లు తాము ఎందుకు ఓటు వేయాలో తెలుపుతూ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితి నుంచి బయటప డాలంటే యువత ఓటు ఎంత కీలకమో అవగాహన కల్పించేలా ‘మై ఫస్ట్‌ ఓట్‌ టు ఏపీ’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

యువ ఓటర్లే లక్ష్యంగా కార్యక్రమాలు

మై ఫస్ట్‌ ఓట్‌ టు ఏపీ పేరుతో సమావేశాలు

దేవినేని చందుకు మచిలీపట్నం పార్లమెంటు, విజయవాడ తూర్పు బాధ్యతలు

కిలారు నాగ శ్రవణ్‌కు విజయవాడ పార్లమెంటు బాధ్యతలు

యువ ఓటర్లపై తెలుగుదేశం దృష్టి సారించింది. మొదటి సారి ఓటు వేయబోతున్న యువతను లక్ష్యంగా చేసుకుంది. వీరి కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. యువ ఓటర్లు తాము ఎందుకు ఓటు వేయాలో తెలుపుతూ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితి నుంచి బయటప డాలంటే యువత ఓటు ఎంత కీలకమో అవగాహన కల్పించేలా ‘మై ఫస్ట్‌ ఓట్‌ టు ఏపీ’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 31,93,250. వీరిలో తొలి సారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య సుమారు 70వేల వరకు ఉంటుంది. వీరితోపాటు 25 ఏళ్లలోపు ఉన్న ఓటర్ల సంఖ్య మరో 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. మొత్తం మీద యువ ఓటర్లు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ‘మై ఫస్ట్‌ ఓట్‌ టు ఏపీ’ కార్యక్రమానికి రూపకల్పన

చేసింది. ఇందులో భాగంగా తొలి ఓటర్లతోపాటు యువతను లక్ష్యంగా చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘దేశ దిశ, దశను మార్చే అస్త్రం ఓటు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ద్వారా ప్రభుత్వాలను, పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం ఉంది. అందుకే యువత ఓటును నిర్లక్ష్యం చేయొద్దు’ అని చెప్పడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.

కార్యక్రమాల బాధ్యతలు అప్పగింత

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ‘మై ఫస్ట్‌ ఓట్‌ టు ఏపీ’ కార్యక్రమాలను తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్‌ పర్యవేక్షించనున్నారు. త్వరలో అవనిగడ్డ, పెడన, గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం రెండు మీటింగ్స్‌ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. టౌన్‌ హాల్‌ మీటింగ్స్‌, కళాశాలల దగ్గర యువతకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని మిగిలిన 6 నియోజకవర్గాల్లో కిలారు నాగశ్రవణ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏపీ భవిష్యత్తు కోసం మొదటి ఓటు వేయండి

‘రాష్ట్ర భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. మనం వేసే ఓటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి. నిరుద్యోగ సమస్యలు, విద్య, వైద్యం, న్యాయం, భద్రత అందించగలిగే వారికే ఓటు వేయాలి. తొలి ఓటును తెలివిగా వేయాలి. కులం మతం కాదు, నాయకుడి సమర్థత చూసి ఓటేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. నేను ఒక్కడినే ఓటు వేయకపోతే పోయేదేముందని అనుకోకుండా, ఒక్క ఓటు మన భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందనే అవగాహన యువ ఓటర్లలో కల్పించడమే మా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ‘‘ఏపీ భవిష్యత్తు కోసం మీ మొదటి ఓటు వేయండి’’ అన్న పిలుపుతో యువతను చైతన్యం చేస్తాం.

-దేవినేని చందు

Updated Date - Feb 14 , 2024 | 01:14 AM

Advertising
Advertising