తిట్లూ.. తోపులాటలు..
ABN, Publish Date - Feb 12 , 2024 | 01:26 AM
ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో యుద్ధాన్ని తలపిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రణరంగాన్ని సృష్టిస్తోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ రిజిస్ర్టేషన్లు చేయాలని టార్గెట్లు నిర్దేశిస్తోంది. దీంతో ఎవరికివారు జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్లపై పడ్డారు. ఆదివారం కూడా రిజిస్ర్టేషన్ల కార్యక్రమాన్ని నిర్వహించటంతో.. గ్రామ, వార్డు సచివాలయాలు లబ్ధిదారులతో పోటెత్తాయి. సచివాలయాల దగ్గర తోపులాటలు జరిగాయి. వృద్ధులు చాలాచోట్ల సొమ్మసిల్లి పడిపోయారు. ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్‌కు సమయం లేదంటూ రెవెన్యూ సిబ్బంది చేసిన హడావిడి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
రణరంగంగా ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్
రిజిస్ర్టేషన్ల పేరుతో మహిళా లబ్ధిదారులపై ఒత్తిడి
అందరూ సచివాలయాలకు రావాలని ఆదేశాలు
సచివాలయాలకు పోటెత్తిన మహిళలు..
క్యూ లైన్లలో సొమ్మసిల్లిన వృద్ధులు
ఒక విధానం లేకుండా ఒత్తిడి చేయటంతో అదుపు తప్పిన పరిస్థితి
ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో యుద్ధాన్ని తలపిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రణరంగాన్ని సృష్టిస్తోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ రిజిస్ర్టేషన్లు చేయాలని టార్గెట్లు నిర్దేశిస్తోంది. దీంతో ఎవరికివారు జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్లపై పడ్డారు. ఆదివారం కూడా రిజిస్ర్టేషన్ల కార్యక్రమాన్ని నిర్వహించటంతో.. గ్రామ, వార్డు సచివాలయాలు లబ్ధిదారులతో పోటెత్తాయి. సచివాలయాల దగ్గర తోపులాటలు జరిగాయి. వృద్ధులు చాలాచోట్ల సొమ్మసిల్లి పడిపోయారు. ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్‌కు సమయం లేదంటూ రెవెన్యూ సిబ్బంది చేసిన హడావిడి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం): లబ్ధిదారులకు భూ బదలాయింపు హక్కులను కల్పించే అధికారాన్ని ప్రభుత్వం వీఆర్వోలకు అప్పగించింది. ఈ క్రమంలో తమ పని ముగించుకునేందుకు వీఆర్వోలు సచివాలయాల పరిధిలోని వలంటీర్లకు సమయం లేదంటూ హడావిడి చేయించారు. వాస్తవానికి రిజిస్ర్టేషన్లు ఎప్పుడైనా చేయొచ్చు. గడువు ఏమీ లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌లోపు చేయించాలన్న కారణంతో ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు హడావిడిగా జిల్లా యంత్రాంగం వీఆర్వోలపై కత్తిపెట్టడంతో అంతా ఊరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. సచివాలయాల పరిధిలో వందల సంఖ్యలో లబ్దిదారులు ఉంటారు. ఈ విషయాన్ని వీఆర్వోలు మరిచిపోయారు. రోజుకు ఎంత మందికి చేయగలం? ఎంతమందిని రిజిస్ర్టేషన్లకు పిలవొచ్చు? వంటి ఆలోచనలు చేయలేదు. కనీసం టోకెన్ విధానాన్ని కూడా పాటించలేదు. ఏ రోజు ఎవరు రావాలో వలంటీర్లకు టోకెన్ ఇవ్వటం ద్వారా కూడా ఇలాంటి రద్దీని నివారించవచ్చు. ప్రభుత్వం టార్గెట్ పెట్టిందన్న పేరుతో లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టే విధంగా చర్యలు చేపట్టారు.
సచివాలయాలకు పోటెత్తిన లబ్ధిదారులు
ఆదివారం ఉమ్మడి జిల్లాలో తలపెట్టిన జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్ గన్నవరం, కంకి పాడు, ఉయ్యూరు, మైలవరం, గంపలగూడెం, నందిగామ, తిరువూరు, జీ కొండూరు, విజయవాడ రూరల్, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం మండలాల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలకొన్న స్వల్ప ఉద్రిక్త పరిస్థితలు ఏర్పడ్డాయి. సెలవుదినం కావటంతో మహిళా లబ్ధిదారులంతా ఒకేసారి రావటంతో సచివాలయాలు పోటెత్తాయి. రిజిస్ర్టేషన్లు చేయటానికి జాప్యం అవుతుండటంతో గంటల తరబడి నిలుచోవాల్సి రావటంతో లబ్ధిదారుల్లో అసహనం నెలకొంది. మండుటెండలో క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రతి సచివాలయం పరిధిలోనూ క్యూలు రోడ్ల మీదకు వచ్చేశాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత మరో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇలా మొత్తం నాలుగు లక్షల ఇళ్ల ప్లాట్ల లబ్ధిదా రులు ఉన్నారు. వీరందరికీ ఒకేసారి రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్టు చెప్పటంతో.. అందరూ ఒకేసారి రావటంతో సచివాలయాలు కిటకిటలాడాయి. రిజిస్ర్టేషన్ల పేరుతో మ మ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తారా అంటూ పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. హడావిడిగా రిజిస్ర్టేషన్లు చేయటమేమిటని, రిజిస్ర్టేషన్లకు గడువు లేనపుడు ఇవాళ రావాలని ఒత్తిడి చేయటం ఎందుకని ప్రశ్నించారు. ఎంత మందికి ఒక రోజులో రిజిస్ర్టేషన్లు చేయగలరని, వందల మందిని సచివాలయాలకు పిలిచారని మహిళా లబ్ధిదారులు ప్రశ్నించారు.
Updated Date - Feb 12 , 2024 | 01:26 AM