ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యంపై మాటతప్పిన జగన్‌ను గద్దె దింపుతాం

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:23 AM

దశల వారీగా మద్య నిషేధం చేస్తానని నమ్మించి మహిళల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ గద్దె దింపేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని మహిళా సమాఖ్య(ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని అన్నారు.

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న దుర్గాభవాని

విజయవాడ రూరల్‌, ఫిబ్రవరి 29 : దశల వారీగా మద్య నిషేధం చేస్తానని నమ్మించి మహిళల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ గద్దె దింపేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని మహిళా సమాఖ్య(ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్‌ కాలనీ వద్ద ఉన్న బార్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలతో బార్‌ నిర్వాహకులు వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడకు చేరుకున్న పోలీసులు సర్ధిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సందర్భంగా దుర్గాభవాని మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఊరూరు తిరిగి దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని జగన్‌ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే నిషేధ హామీని గాలికి వదిలేసి మద్యంపై వచ్చే ఆదాయాన్నే ప్రధాన వనరుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా రాష్ట్రంలో 70వేలకు పైగా బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయన్నా. రానున్న ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు పంచదార్ల దుర్గాంబ, బంకా ఝాన్సీ, భారతి, మేకల కుమారి, పార్వతి, జ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:23 AM

Advertising
Advertising