ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైఎస్‌ వివేకాను హతమార్చింది జగన్‌ ముఠానే

ABN, Publish Date - Mar 03 , 2024 | 01:07 AM

రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని జగన్‌ ముఠా హత్య చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజకీయ లబ్ధి కోసమే హత్య: బొండా ఉమా

పాయకాపురం, మార్చి 2: రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని జగన్‌ ముఠా హత్య చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య జరిగిన రోజునే బాబాయిని గొడ్డలితో చంపారని సీఎం జగన్‌ చెప్పారని, అంత కచ్చితంగా జగన్‌ ఎలా చెబుతారని, సీఎంకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత డిమాండ్‌ చేస్తే జగన్‌ ఎందుకు ఆపారో చెప్పాలన్నారు. మొదటి సీబీఐ విచారణ కోరిన జగన్‌ గద్దెనెక్కాక సీబీఐ విచారణ వద్దు అనడానికి కారణం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం అయిన అనంతరం జగన్‌ సీబీఐ పిటిషన్‌ ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నిం చారు. బాబాయిని చంపిన అబ్బాయిని జగన్‌ రక్షించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడానికి సీబీఐ అధికారులు కర్నూల్‌కు వస్తే వారిని ఎందుకు అడ్డుకు న్నారన్నారు. జగన్‌ సోదరి సునీత అడుగుతున్న ప్రశ్న లకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చం పిన నిజాన్ని జగన్‌ ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబానికి చెందిన ఆడబిడ్డకు న్యాయం చేయ లేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత చేస్తున్న న్యాయపోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డిని అతి క్రూరంగా గొడ్డ లితో చంపిన హంతకులకు శిక్ష పడకపోతే రాష్ట్రంలో పౌరుల మాన, ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ ఉండాలంటే సునీత చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలి: నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, మార్చి 2: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌రెడ్డి పాత్రపై సమగ్ర విచారణ జర పాలని టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘు రాం శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రతి పక్ష నేతగా సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన జగన్‌ సీఎం కాగానే యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత పిటిషన్‌ వేస్తానంటే ఎందుకు నిలువరించారని నిలదీశారు. సోదరుడు ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బాబాయిను హత్య చేయించిన జగన్‌.. నిందితులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తు న్నారని, సోదరి సునీత లేవనెత్తిన సందేహాలను సీఎం నివృత్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సునీతారెడ్డి ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పాలి: కాగిత కృష్ణప్రసాద్‌

బంటుమిల్లి, మార్చి 2: ‘‘జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని జగన్‌ ముఠా హతమార్చింది. వివేకా హత్యపై ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి సంధిస్తున్న ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి.’’ అని టీడీపీ-జనసేన కూటమి పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నాగేశ్వరరావుపేటలో స్థానిక స్వపరి పాలన, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం డిక్లరేషన్‌ పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వివేకా హత్యకేసులో జగన్‌ పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొదట్లో సీబీఐ విచారణ కోరిన జగన్‌ తరువాత వద్దు అనడానికి కారణాన్ని రాష్ట్ర ప్రజలకు తెలపాలన్నారు. ఇకనైనా శవరాజకీయాల్ని మానుకోవాలన్నారు. సునీతారెడ్డి న్యాయపోరాటానికి 5 కోట్ల ఆంధ్రులు పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 01:07 AM

Advertising
Advertising