ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విజిలెన్స్‌ను కదిలించిన ఇంటెలిజెన్స్‌

ABN, Publish Date - Mar 04 , 2024 | 01:31 AM

ఒక నివేదిక పాత నీరును పంపేసింది. కొత్త నీరును తీసుకొచ్చింది. విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల మార్పు వెనుక ఇంటెలిజెన్స్‌ నివేదిక ఉన్నట్టు నిఘా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వివిధ జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు విజిలెన్స్‌ను ఎంచుకున్నారు. అప్పటి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సిఫార్సులు చేయించుకున్నారు.

ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలపై రహస్య నివేదిక

పీడీఎస్‌ బియ్యం మాఫియాతో లింక్‌లు

విభాగంలోకి కొత్త నీరు

ప్రస్తుతం ఉన్న వారిని రేంజ్‌కు పంపిన అధికారులు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఒక నివేదిక పాత నీరును పంపేసింది. కొత్త నీరును తీసుకొచ్చింది. విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల మార్పు వెనుక ఇంటెలిజెన్స్‌ నివేదిక ఉన్నట్టు నిఘా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వివిధ జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు విజిలెన్స్‌ను ఎంచుకున్నారు. అప్పటి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సిఫార్సులు చేయించుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజిలెన్స్‌కు వెళ్లిన అధికారులు అక్కడే పాతుకుపోయారు. కొంతమంది రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయం నుంచి చక్రం తిప్పితే, కొంతమంది జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ కార్యాలయంలో చక్రం తిప్పారు. కల్తీ వ్యవహారాలు, నకిలీ బాగోతాలను వెలికి తీయాల్సిన విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఆ మాఫియాలతో మిలాఖత్‌ అయినట్టు తీవ్రంగా ఆరోపణలు ఉన్నాయి. నేరుగా నిఘా విభాగంలో అధికారులు అండదండలు ఉండడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కల్తీ మాఫియా రెచ్చిపోతోందని తెలిసింది.

అసలు ఏం జరిగింది?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బియ్యం మాఫియా భూమి మీద నిలబడటం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని లారీల్లో మిల్లులకు, పోర్టులకు తరలిస్తోంది. ఈ మాఫియాకు జిల్లా మొత్తం కొంతమంది ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ బియ్యాన్ని భద్రపరచడానికి ఆటోనగర్‌లో పెద్ద గొడౌన్‌ నడుస్తోంది. ఇక్కడ రాత్రిపూట లోడింగ్‌, అన్‌లోడింగ్‌ జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ తరహా గోడౌన్లను మాఫియా నిర్వహిస్తోంది. విజిలెన్స్‌ అధికారులు ఇప్పటి వరకు ఈ గోడౌన్ల జోలికి వెళ్లిన దాఖలు ఎక్కడా కనిపించలేదు. నిఘా విభాగం పనిచేస్తుందన్న భావన కలిగించడానికి అప్పడప్పుడు మెరుపు దాడులు చేసేవారు. ఆటోలు, మినీ వాహనాల్లో వెళ్తున్న బియ్యాన్ని సీజ్‌ చేశామని ప్రకటనలు ఇచ్చేవారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గొడౌన్లలో అనధికారికంగా ఉన్న పీడీఎస్‌ బియ్యం గుట్టు తెలిసినా వాటివైపు కన్నెత్తి చూడలేదు. దీని కారణం నెలవారీగా మాఫియా నుంచి లక్షలాది రూపాయల ముడుపులు అందడమేనని ప్రచారం జరుగుతోంది. కొద్దినెలల క్రితమే ఇంటెలిజెన్స్‌ విభాగం దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక నివేదికను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు సమాచారం. ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో ఈ నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు విజిలెన్స్‌లో ఉన్న పాత ముఖాలను బయటకు పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక ఎస్‌ఐను విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌కు పంపేశారు. ఇన్‌స్పెక్టర్‌ను ఏలూరు రేంజ్‌కు సరెండర్‌ చేశారు. రేంజ్‌ అధికారులు ఎన్నికల బందోబస్తు నిమిత్తం ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌కు అటాచ్‌మెంట్‌ ఇచ్చారు.

ఉన్నతాధికారుల పరిచయాలతో...

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి వెళ్లాంటే దానికి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. విజిలెన్స్‌కు వెళ్లాలనుకున్నవారు ముందుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన సంబంఽధిత యూనిట్‌ ఆఫీసర్‌ (కమిషనర్‌/ఎస్పీ) ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను, ట్రాక్‌ రికార్డును రప్పించుకుంటారు. అన్నీ పరిశీలించుకున్న తర్వాత విజిలెన్స్‌లో పనిచేయడానికి వారు అర్హులు అని గుర్తిస్తే ఆ ఫైల్‌ను డీజీపీ కార్యాలయంలో ఉన్న పర్సనల్‌ విభాగానికి పంపుతారు. ఈ విభాగం ఆయా కమిషనరేట్‌, జిల్లాలో ఉన్న సిబ్బంది సంఖ్యను పరిశీలించిన తర్వాత రిలీవింగ్‌ ఉత్తర్వులు ఇస్తుంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు విజిలెన్స్‌ విభాగంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇలా వెళ్లిన వారి సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, ఆరోపణలు తీవ్రమైన స్థాయిలో ఉన్నా వారిని తిరిగి పర్సనల్‌ విభాగానికి పంపేస్తారు. అక్కడి నుంచి ఏలూరు రేంజ్‌కు సరెండర్‌ చేస్తారు. 2019లో వైసీపీ విజయవాడలో పోలీసు కమిషనర్‌గా పనిచేసిన అధికారులు డీజీ స్థాయికి వెళ్లడంతో ఆ పరిచయాలను ఉపయోగించుకుని కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు వారి ఫైళ్లను చకచకా నడిపించుకు న్నారు. ఐదేళ్లపాటు అటు రాష్ట్ర కార్యాలయంలో, ఇటు జిల్లా కార్యాలయంలో తిష్ట వేసుకుని ఉండిపోయారు.

Updated Date - Mar 04 , 2024 | 01:31 AM

Advertising
Advertising