కట్లేరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:47 AM
ఇసుక అక్రమ రవాణా చేస్తూ వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
గంపలగూడెం, ఫిబ్రవరి 29: ఇసుక అక్రమ రవాణా చేస్తూ వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. గురువారం గంపలగూడెం, పెదకొమెర గ్రామాల పరిఽధిలోని కట్లేరు నుంచి 20కు పైగా ట్రాక్టర్లతో అధికార పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుకను రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు గంపలగూడెం మండల పరిధిలోని గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కింద మంజూరైన పనుల పేరిట అధికారుల నుంచి 15 రోజుల క్రితం తీసుకున్న కూపన్లను అడ్డు పెట్టుకొని అక్రమ రవాణాతో చెలరేగిపోతున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు దిరిశాల వెంకట కృష్ణారావు తన అనుచరులతో గురువారం అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో గ్రామ కార్యదర్శులు రంగంలోకి దిగి ట్రాక్టర్లను నిలువరించేందుకు వెళ్లగా వారిని సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం ఇసుకను తరలించుకున్నారు. వైసీపీ నాయకులు అధికార దర్పానికి పోలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకుండా మౌనంగా ఉండిపోవడంతో అక్రమార్కులకు ఇసుక కల్పతరువుగా మారిందని స్థానికులు అంటున్నారు. దీనిపై ఎంపీడీవో నాగేశ్వరరావును వివరణ కోరగా గురువారం ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:47 AM