టీడీపీతోనే బీసీలకు ఉపాధి అవకాశాలు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:48 AM
టీడీపీ ఆవిర్భావం తరువాతనే రాష్ట్రంలో బీసీలకు తగిన గుర్తింపు లభించిందని టీడీపీ సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
టీడీపీతోనే బీసీలకు ఉపాధి అవకాశాలు
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
గవర్నర్‌పేట, మార్చి 2: టీడీపీ ఆవిర్భావం తరువాతనే రాష్ట్రంలో బీసీలకు తగిన గుర్తింపు లభించిందని టీడీపీ సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ విజయవాడ పార్లమెంటు నియోజవర్గం నాయకులు కేశినేని శివనాథ్ సహకారంతో 23వ డివిజన్‌లోని రజక సోదరులకు ఇస్త్రీ పెట్టెల పంపిణీ కార్యక్రమం జరిగింది.
డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలి సొంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. డివిజన్ నేతలు చింతా దుర్గారావు, ఆలపాటి రాము, కోటి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:48 AM