ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా అభ్యర్థుల వివరాలు

ABN, Publish Date - Feb 25 , 2024 | 01:44 AM

టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా అభ్యర్థుల వివరాలు

ఎన్టీఆర్‌ జిల్లా అభ్యర్థుల వివరాలు

నియోజకవర్గం: విజయవాడ సెంట్రల్‌

అభ్యర్థి పేరు: బొండా ఉమామహేశ్వరరావు

విద్యాభ్యాసం: అండర్‌ గ్రాడ్యుయేషన్‌

కులం: కాపు

వయస్సు: 58

భార్య పేరు: బొండా సుజాత

పిల్లలు: బొండా సిద్ధార్థ(అమెరికా), జశ్వంతి

(కోడలు), బొండారవితేజ(లాయర్‌)

రాజకీయ నేపథ్యం: టీడీపీలో 2013 నుంచి పనిచేస్తున్నారు.2014లో విజయ వాడ సెంట్రల్‌ నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్‌రెడ్డిపై 25 వేలపై చిలుకు ఓట్లతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

నియోజకవర్గం: విజయవాడ తూర్పు

అభ్యర్థి పేరు: గద్దె రామ్మోహన్‌

విద్యాభ్యాసం: ఎంఎస్సీ మైక్రోబయాలజీ

కులం: కమ్మ

వయస్సు: 64

భార్య పేరు: గద్దె అనురాధ

పిల్లలు: ఇద్దరు కుమారులు

రాజకీయ నేపథ్యం: గన్నవరం నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత టీడీపీలో చేరి 1999లో విజయ వాడ ఎంపీగా గెలుపొందారు. 2004లో కంకిపాడు నుంచి పోటీచేసి ఓడిపో యారు. 2009లో విజయవాడ తూర్పు నుంచి ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధించారు.

నియోజకవర్గం: తిరువూరు

అభ్యర్థి పేరు: కొలికపూడి శ్రీనివాసరావు

విద్యాభ్యాసం: డబుల్‌ ఎం.ఏ, కేఎస్‌రావు

ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకుడు

కులం: ఎస్సీ(మాదిగ)

వయస్సు: 56

భార్య పేరు: మాధవి

పిల్లలు: కుమార్తె(సాయిఅక్షర)

రాజకీయ నేపథ్యం: స్వస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తిరువూరు నియోజక వర్గంలో కిడ్నీ బాధితులకు తాగు నీటి కోసం పాదయాత్ర చేయడంతో పాటు పలు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తుంటారు.

నియోజకవర్గం: నందిగామ

అభ్యర్థి పేరు: తంగిరాల సౌమ్య

విద్యాభ్యాసం: బీటెక్‌ చేశారు. బెంగళూరులో

కొంతకాలం సాఫ్ట్‌వేర్‌

ఇంజనీరుగా పనిచేశారు.

కులం: ఎస్సీ(మాదిగ)

వయస్సు: 43

భర్త పేరు: మోహనరావు

పిల్లలు: ఇద్దరు(కుమార్తె, కుమారుడు)

రాజకీయ నేపథ్యం: తండ్రి తంగిరాల ప్రభాకరరావు నందిగామ శాసనసభ్యుడిగా 2009, 2014లో గెలుపొందారు. ఆయన అకాల మరణంతో రాజకీయాలలోకి వచ్చిన సౌమ్య ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు.

నియోజకవర్గం:: జగ్గయ్యపేట

అభ్యర్థి పేరు: శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య

విద్యాభ్యాసం: డిగ్రీ

కులం: వైశ్య

వయస్సు: 55

భార్య పేరు: శ్రీదేవి

పిల్లలు: ఇద్దరు(కుమార్తె, కుమారుడు)

డాక్టర్‌ కృష్ణ మైథిలి, కృష్ణ పవన్‌

రాజకీయ నేపథ్యం: కళాశాల నుంచే విద్యార్థి సంఘ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కాంగ్రెస్‌ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షుడిగా 20 ఏళ్లు పైగా పనిచేశారు. జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓడిపోయారు.

కృష్ణా జిల్లా అభ్యర్థుల వివరాలు

నియోజకవర్గం: పెడన

అభ్యర్థి పేరు: కాగిత కృష్ణ ప్రసాద్‌

విద్యాభ్యాసం: బీటెక్‌(కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు)

కులం: గౌడ

వయస్సు: 42

భార్య పేరు: కాగిత శిరీష

పిల్లలు: కుమార్తె, కుమారుడు(కాగిత

లలిత వెంకటచంద్ర)

రాజకీయ నేపథ్యం: తండ్రి కాగిత వెంకట్రావు టీడీపీ ఆవిర్భావం నుంచి తుదిశ్వాస విడిచే వరకు పార్టీలో ఉండి అనేక పదవులు చేపట్టారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ ప్రసాద్‌ 2019లో పోటీ చేసి ఓడిపోయారు.

నియోజకవర్గం: పామర్రు

అభ్యర్థి పేరు: వర్ల కుమార్‌ రాజా

విద్యాభ్యాసం: బీటెక్‌

కులం: ఎస్సీ(మాదిగ)

వయస్సు: 46

భార్య పేరు: విశ్రమ

పిల్లలు: కుమార్తె, కుమారుడు(అలాన జోయల్‌, రోయస్‌ యుగంధర్‌)

రాజకీయ నేపథ్యం: తండ్రి టీడీపీ సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య. ఆయన రాజకీయ వారసుడిగా 2008లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు.

నియోజకవర్గం: మచిలీపట్నం

అభ్యర్థి పేరు: కొల్లు రవీంద్ర

విద్యాభ్యాసం: బీఏ, ఎల్‌ఎల్‌బీ

కులం: అగ్నికుల క్షత్రియ

వయస్సు: 51

భార్య పేరు: కొల్లు నీలిమ

పిల్లలు: ఇద్దరుకుమారులు (పునీత్‌ చంద్ర(బీటెక్‌), కొల్లు నవీన్‌)

రాజకీయ నేపథ్యం: ప్రముఖ బీసీ నాయకుడు దివంగత నడకుదిటి నరసింహారావుకు రవీంద్ర అల్లుడు. ఆయన ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన రవీంద్ర టీడీపీలో డివిజన్‌ స్థాయి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. 2009లో తొలిసారి మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమిపాలయ్యారు.

నియోజకవర్గం: గన్నవరం

అభ్యర్థి పేరు: యార్లగడ్డ వెంకట్రావు

విద్యాభ్యాసం: బీఎస్సీ(కంప్యూటర్స్‌), అమెరికాలో

ఫస్ట్‌ ఆబ్జెక్ట్స్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌

కంపెనీ నిర్వహిస్తున్నారు.

కులం: కమ్మ

కులం: 49

భార్య పేరు: జ్ఞానేశ్వరి

పిల్లలు: కుమార్తె, కుమారుడు(సహస్ర, సహర్షిరామ్‌)

రాజకీయ నేపథ్యం: రాజకీయాలపై ఆసక్తితో 2019లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా 2 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వినూత్న పథకాలతో రైతులకు ఉపయోగపడే విధంగా సేవలందించారు.

నియోజకవర్గం: గుడివాడ

అభ్యర్థి పేరు: వెనిగండ్ల రాము

విద్యాభ్యాసం: బీటెక్‌(ఈసీఈ),

అమెరికాలో ఎఫిసెన్స్‌

సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ

నిర్వాహకులు

కులం: కమ్మ

వయస్సు: 53

భార్య పేరు: సుఖద(ఎస్సీ-మాల)

పిల్లలు: ఇద్దరు కుమార్తెలు(ప్రణతి, ప్రత్యూష)

రాజకీయ నేపథ్యం: రాజకీయా లపై ఆసక్తితో సొంత ఊరిలో గత కొన్నేళ్లుగా సేవాకార్యక్ర మాలు నిర్వహిస్తూ వచ్చారు.

Updated Date - Feb 25 , 2024 | 01:44 AM

Advertising
Advertising