ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తంబళ్లపల్లెలో టీడీపీ జెండాను ఎగురవేస్తా

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:03 AM

టీడీపీ, జనసేన శ్రేణులందరిని కలుపు కొని వెళ్లి తంబళ్లపల్లె నియోజకవర్గ గడ్డపై రెండు పార్టీల జెండాలను రెపరెపలాడిస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి దాసరి పల్లె జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ములకలచెరువులో ర్యాలీ నిర్వహిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి

ఫటీడీపీ-జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్తా ఫ అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు ఫనియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి

ఫఅంబరాన్నంటిన పార్టీ నేతలు, అభిమానుల సంబరాలు ఫ ములకలచెరువులో భారీ ర్యాలీ ఫ అభ్యర్థిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ- జనసేన శ్రేణులు

ములకలచెరువు, ఫిబ్రవరి 24: టీడీపీ, జనసేన శ్రేణులందరిని కలుపు కొని వెళ్లి తంబళ్లపల్లె నియోజకవర్గ గడ్డపై రెండు పార్టీల జెండాలను రెపరెపలాడిస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి దాసరి పల్లె జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాలో తంబళ్లపల్లె నియో జకవర్గం నుంచి దాసరిపల్లె జయచంద్రారెడ్డికి అవకాశం అల్పించారు. దీంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి టీడీపీ-జనసేన నాయకులు, కార్యర్తలు, మద్దతుదారులు, అభిమానులు ములకలచెరు వులోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ-జనసేన పార్టీ ల ఆరు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు, మద్దతుదారులందరిని సమన్వయ పరుచుకుని అందరిని కలుపు కుని అన్యమయ్య జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో తంబళ్లపల్లె నియో జకవర్గంలో టీడీపీ-జనసేన జెండాలు రెపరెపలాడించి అధినేత చంద్ర బాబునాయుడికి గిఫ్ట్‌గా ఇస్తామన్నారు. తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రెండు నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అధికారంలోకి రాగానే తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇప్పటి వరకు లేని ఇండససి్ట్రయ ల్‌ క్యారిడార్‌ను తప్పకుండా తీసుకొస్తానన్నారు. మీ అందరికి తెలిసిన వ్యక్తిని, మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా భావించి, నన్ను ఆశీర్వదిం చి అత్యధిక మొజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ప్రజలు, మద్దతుదారులు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.

ములకలచెరువులో అంబరాన్నంటిన సంబరాలు

తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా దాసరిపల్లె జయచంద్రా రెడ్డికి అవకాశం దక్కడంతో ములకలచెరువులో సంబరాలు అంబరా న్నంటాయి. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి ములకల చెరువులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన అభిమానులు, మద్దతు దారులు, టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు దారి పొడువునా భారీ ఎత్తు న బాణా సంచాపేల్చుత్తూ పూల వర్షం కురిపించారు. పార్టీ కార్యాల యం నుంచి ఆర్టీసీ బస్టాండు, బస్టాండు సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఓపెన టాప్‌ కారులో నుంచి ప్రజలకు అభివాదం చేశారు.

టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం

ములకలచెరువు వినాయకనగర్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కోలా హలం నెలకొంది. టీడీపీ అభ్యర్ధి దాసరిపల్లె జయచంద్రారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపేందుకు భారీ ఎత్తున ఆరు మండలాల నుంచి మద్దతుదారులు, అభిమానులు, పలువురు టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు తరలిరావడంతో రోజంతా సందడి వాతావరణం నెలకొంది.

తంబళ్లపల్లెలో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లెలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామని తంబళ్లపల్లె టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు, తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరిపల్లె జయ చంద్రారెడ్డికి టికెట్‌ కేటాయించడంపై శనివారం తంబళ్లపల్లెలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్థానిక హరిత కూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.పెద్దఎత్తున బాణసంచా పేల్చి చంద్రబాబు, లోకేశ, జయచంద్రారెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అని నినాదాలు చేశారు. కార్యక్ర మంలో టీడీపీ, జనసేన నాయకులు సాంబశివ, మ్యూజికల్‌ శివ, సుబ్ర మణ్యం, మధుసూధన, బోయపల్లెశివ, మునాఫ్‌, రామాంజులు, మల్లేష్‌, సుబహాన, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

జయచంద్రారెడ్డిని కలసిన పీటీఎం మండల నాయకులు

పెద్దతిప్పసముద్రం ఫిబ్రవరి 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్యెల్యే అభ్యర్థిగా దాసిరిపల్లె జయచంద్రారెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబునా యుడు ప్రకటించగానే శనివారం పీటీఎం మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభా కాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డిని అత్యధిక మెజా ర్టీతో గెలిపించి చంద్రంబాబు నాయుడికి కానుకగా అందిస్తామని టీడీ పీ నాయకులు ఆయనకు భరోసా కల్పించారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి పోరాడే దీటైన నాయకుడు జయచంద్రారెడ్డి అని వారు పేర్కొన్నారు. అందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వర్గవిభేదాలను పక్కన పెట్టి టీడీపీ విజయానికి కృషి చేసి పార్టీని గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్‌ విండో మాజీ అద్యక్షుడుసంపతికోట కిట్టన్న, లోకనాథ్‌రెడ్డి, టీడీపీ యువ నాయకుడు పట్టా చంద్రమోహనరెడ్డి, దేవప్పకోట సర్పంచ సురేష్‌,, బి.కొత్తకోట నాయకులు గట్టు చంద్రన్న, ప్రభాకర్‌, శ్రీనివాసులు, చావిడి కిట్టన్న, కుందిలి శంకర్‌రెడ్డి,పద్మనాభ తదితరులు ఉన్నారు.

బి. కొత్తకోటలో: తంబళ్లపల్లి అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను దాసిరిపల్లి జయ చంద్రారెడ్డికి కేటాయించడంతో బి.కొత్తకోటలో ఆయన అభిమా నులు, పలువురు టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శని వారం జ్యోతి బస్టాండులో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీకి, పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి అనుకూల నినాదాలు చేశారు. కార్యక్రమంలో చావిడి కిట్టన్న, ప్రభాకర, పద్మనాభ పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా దాసరిపల్లి జయ చంద్రరెడ్డిని టీడీపీ అధిస్థానం ప్రకటించడంతో టీడీపీ నాయకులు బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నా రు. టీడీపీ గెలుపు కోసం టీడీపీ నాయకులు అందరు కృషి చేయాలని వారు పిలుపు నిచ్చారు. కలిచెర్ల ఎం.ప్రభాకరరెడ్డి, శేషాద్రి, రామ కృష్ణారెడ్డి, ఖాదర్‌హుసేన, రవినాయక్‌, సయ్యద్‌షావలి, ఖయ్యింబాషా, జి.జయరాం, మాబాషా, అక్బర్‌, ఖాజవలి, రిజ్వాన, ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:03 AM

Advertising
Advertising