ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సృష్టికి మూలమైన మహిళలను గౌరవిద్దాం

ABN, Publish Date - Mar 08 , 2024 | 11:46 PM

ఈ సృష్టికి మూలమైన మహిళలను గౌరవి ద్దామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాం ప్రసాద్‌ రెడ్డి అన్నారు.

మహిళలను సన్మానిస్తున్న మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి

టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, మార్చి 8: ఈ సృష్టికి మూలమైన మహిళలను గౌరవి ద్దామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాం ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గీత బీడీ యజమాని నసీబ్‌జాన్‌, కౌన్సిలర్‌ సర్‌తాజ్‌బేగం, ఫరిదాఖానం, ముంతాజ్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. మహిళలకు భూ హక్కు, మహిళా భద్రత లాం టి ఎన్నో చట్టాలతో పాటు మహిళలకు డ్వాక్రా రుణాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే మొదలయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మల్యే అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడంతో పాటు చంద్ర బాబును ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాష్ట్రం అన్ని విధాలుగా అభి వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు చాలక్‌, ఖాదర్‌మోదీన్‌, అమీర్‌ ఇలాహి, చికెన్‌ ఖాదర్‌బాషా, సోహెబ్‌, మహమ్మద్‌, అష్రప్‌, అహ్మద్‌బాషా, ముబారక్‌బాషా, మయాన సయ్యద్‌ సాబ్‌, బాషాజాన్‌, అంజద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఇదేనా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అంటే...

మురుగుకాలువలతో ఇబ్బందులు పడుతున్నామని పట్టణంలోని 5వ వార్డు మహిళలు, ప్రజలు మండిపల్లి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన మా ట్లాడుతూ కాలువలపై పైకప్పు కూడా లేదని, దు ర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం రాయచోటిని అభివృద్ధి చేసేశానంటూ గొప్పలు చెబుతున్నాడని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు వచ్చినపుడు శ్రీకాంత్‌రెడ్డిని నిలదీయాలని తెలిపారు. జనావా సాలు లేని చోట కమిషన్లు దండుకుని అండ ర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేసి చేతులు దులుపుకున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటేసి తను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 08 , 2024 | 11:46 PM

Advertising
Advertising