ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:50 PM

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ప్రైవేటు సంస్థ మోసగించిన వైనం మదనపల్లెలో వెలుగుచూ సింది.

ఫ రూ.45వేలు గుంజిన వైనం

ఫ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

మదనపల్లె టౌన, మార్చి 1: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ప్రైవేటు సంస్థ మోసగించిన వైనం మదనపల్లెలో వెలుగుచూ సింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డు బాపూజి పార్కు ఎదురుగా నాలుగంతస్థుల భవనంపై ఓ ప్రైవే టు సంస్థ నాలుగు నెలలుగా కన్సల్టెంట్‌, గైడ్‌లైన్స పేరుతో నిరుద్యోగులకు నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం కంచెం వారిఇండ్లుకు చెందిన అమరనాథ్‌ కుమారుడు రాజశే ఖర్‌ (19)కు అతని స్నేహితుడు జగదీష్‌ ద్వారా మదనపల్లెలో ఓ సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తారని చెప్పడంతో మద నపల్లెకు చేరుకుని సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రూ.45 వేలు చెల్లిస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో తన తండ్రి వద్ద రూ.45వేలు నగదు తీసుకుని సంస్థకు చెల్లించారు. అతని కి తెలుపు షర్టు, నలుపు ఫ్యాంటు యూనిఫామ్‌ దుస్తులు అం దజేసి తరువాత రాజశేఖర్‌ను మరో ఐదు మంది నిరుద్యో గులను ఈ స్కీమ్‌ కింద చేర్చమని షరతులు పెట్టారు. తనకు ఉద్యోగం కల్పించమని కోరితే చైన లింక్‌ బిజినెస్‌ చేయమంటా రేమంటూ రాజశేఖర్‌ ప్రశ్నించడంతో అతడిని సంస్థ ప్రతిని ధులు బయటకు గెంటేశారు. దీంతో బాధితుడు శుక్రవారం మదనపల్లె టు టౌన సీఐ యువరాజుకు ఫిర్యాదు చేశాడు. దీని పై ప్రైవేటు సంస్థ ప్రతినిధులను స్టేషనకు పిలిపించిన సీఐ అక్కడ జరుగుతున్న ప్రక్రియపై ఆరా తీశారు. చైన లింక్‌ సిస్టం ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంస్థ ద్వారా ఎంత మం దికి ఉద్యో గాలు కల్పించారో తదితర విషయాలపై విచారిస్తున్నారు. నిరు ద్యోగులను మోసం చేసే సంస్థలపై తప్పకుండా కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తామని సీఐ పేర్కొన్నారు.

ఇసుక డంపింగ్‌..స్మగ్లింగ్‌పై పోలీసుల ఆరా

మదనపల్లె టౌన, మార్చి 1: మదనపల్లె పట్టణ శివారుల్లో ఇసు క డంపింగ్‌, అక్రమ రవాణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ‘పగలు డంపింగ్‌..రాత్రి స్మగ్లింగ్‌’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తా కథనానికి మదనపల్లె తాలూకా పోలీసులు స్పందించారు. ఈ క్రమంలో మదనపల్లె తాలూకా సీఐ శేఖర్‌ ఈ విషయమై ఆరా తీయాల్సిందిగా తాలూకా ఎస్‌ఐ రవికుమార్‌ను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఎస్‌ఐ రవికు మార్‌, సిబ్బందితో తురకపల్లె వద్ద డంపింగ్‌ చేసిన ఇసుక నిల్వ లను పరిశీలించారు. ఈ ఇసుకను ఎవరు, ఎక్కడి నుంచి రవా ణా చేస్తున్నారన్న విషయమై ఆరా తీస్తున్నామన్నారు. సీఐ శేఖ ర్‌ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నిఘా పెట్టి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:50 PM

Advertising
Advertising