ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలీసులను అడ్డుపెట్టుకొని బతుకుతున్న జగన్‌

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:20 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజలపై నమ్మకం లేక పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను అణచాలని చూస్తున్నారని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. టీడీపీ రాష్ట్ర

బాధితుల కోసం 73062 99999 నంబర్‌తో కాల్‌ సెంటర్‌

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజలపై నమ్మకం లేక పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను అణచాలని చూస్తున్నారని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గురువారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది నివాసాలపై బుధవారం రాత్రి పోలీసులు జరిపిన దాడులు, చేసిన సోదాలను వారు తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రతిపక్ష పార్టీల వారిని భయపెట్డడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘టీడీపీ, జనసేన కార్యకర్తలు, సోషల్‌ మీడియా వారియర్లకు అధికార పార్టీకి సంబంధించిన వారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. పోలీసులతో ఫోన్లు చేయుంచి స్టేషన్‌కు రావాలని పిలిపిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులను పట్టించుకోవద్దు. స్టేషన్‌కు రావాలని చెప్పినా వెళ్లాల్సిన అవసరం లేదు. బెదిరింపులకు గురైన వారికి న్యాయ సహాయం ఇవ్వడానికి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పవచ్చు’ అని అచ్చెన్న తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 03:20 AM

Advertising
Advertising