ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌ చెడు మాత్రమే చేశాడు!

ABN, Publish Date - Mar 08 , 2024 | 04:16 AM

జగన్‌ తన పరిపాలనలో చెడు మాత్రమే చేశాడు. ప్రజలకు చెడును నేర్పాడు. తల్లినీ చెల్లినీ తరిమేసిన అతను తెలుగు తల్లినీ తరిమేస్తాడు.. లేదా అమ్మేస్తాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు

తల్లినీ చెల్లినీ తరిమేశాడు

తెలుగు తల్లినీ అమ్మేస్తాడు: నారా భువనేశ్వరి

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ యాత్ర

గుంతకల్లు, పత్తికొండ, మార్చి7: ‘జగన్‌ తన పరిపాలనలో చెడు మాత్రమే చేశాడు. ప్రజలకు చెడును నేర్పాడు. తల్లినీ చెల్లినీ తరిమేసిన అతను తెలుగు తల్లినీ తరిమేస్తాడు.. లేదా అమ్మేస్తాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. రానున్నది కురుక్షేత్ర సంగ్రామమని, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో కూల్చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొనసాగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురంలో మరణించిన వార్డు మెంబరు ఆంజనేయులు, బేతాపల్లి గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త జయమ్మ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆంజనేయులు కుమార్తె సుంకమ్మను, జయమ్మ కుమార్తె జయలక్ష్మిని ఓదార్చారు. అలాగే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మీటేతండాలో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ రమావత్‌ లక్ష్మి, అదే మండలంలోని కడమకుంట్లలో మృతి చెందిన వడ్డే చిన్నరంగన్న, కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్‌ ఎర్రగుడి గ్రామంలో మృతిచెందిన సుబహాన్‌, ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో మృతిచెందిన బోయ ఉరుకుంద కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. సుబహాన్‌ కూతురు ఆత్మకు పుట్టుకతోనే కళ్లు కనిపించవని నేతలు తెలపడంతో ఆ చిన్నారి కంటిచూపు బాధ్యత తీసుకుంటామని, సుబహాన్‌ ముగ్గురు పిల్లలకూ ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆయా గ్రామాలలో ప్రజలనుద్దేశించి భవనేశ్వరి మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ వెతలు అనుభవిస్తున్నార న్నారు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి లీడర్‌ అవుతాడని, ప్రజలను వేపుకుతింటున్న జగన్‌ నాయకుడు కాదని విమర్శించారు.

Updated Date - Mar 08 , 2024 | 06:49 AM

Advertising
Advertising