వీఆర్‌ఎస్ తీసుకున్న 24 గంటల్లోనే వైసీపీలోకి ఇంతియాజ్!
ABN, Publish Date - Mar 01 , 2024 | 03:13 AM
స్వచ్ఛంద పదవీవిరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్న 24 గంటల్లోపే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఏడాది మే 31 వరకు సర్వీసు ఉన్నా.. ఆయన బుధవారం ఉదయం వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేయడం..
సీఎం జగన్ సమక్షంలో చేరిక
కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జిగా నేడో రేపో ప్రకటన
అమరావతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంద పదవీవిరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్న 24 గంటల్లోపే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఏడాది మే 31 వరకు సర్వీసు ఉన్నా.. ఆయన బుధవారం ఉదయం వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేయడం.. మధ్యాహ్నానికి ప్రభుత్వం అంగీకరించడం.. సాయంత్రానికి వీఆర్‌ఎ్‌సను ఆమోదిస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి జీవో 477 జారీచేయడం తెలిసిందే. అంతే వేగంతో ఆయన గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి ఇంతియాజ్ సీఎంతో సమావేశమయ్యారు. జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హఫీజ్‌ఖాన్ స్థానంలో కర్నూలు అసెంబ్లీ సీటు ఇన్‌చార్జిగా ఇంతియాజ్‌ను నేడో రేపో జగన్ ప్రకటిస్తారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 09:02 AM