ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈ అన్నం ఎలా తినాలి ?

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:03 AM

గోరుముద్ద పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడతున్నాం అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం

నాసిరకంగా మధ్యాహ్న భోజనం

పట్టించుకోని అధికారులు

హొళగుంద, మార్చి 2: గోరుముద్ద పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడతున్నాం అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. గ్రామీణ స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పర్యవేక్షణ లోపంతో అధికారులు పట్టించుకోకపోవడంతో, మధ్యాహ్న భోజనం నిర్వాకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ భోజనం ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. హొళగుంద మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలోని మండల పరిషత్‌ ఆదర్శ పాఠశాలలో 150 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. శనివారం మాత్రం 125 మంది విద్యార్థులు భోజనం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాత్రం విద్యార్థులకు సరిపడినంత ఆహారం తయారు చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వా పోతున్నారు. 150 మందికి గాను కేవలం 75 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం తయారు చేస్తున్నారని, మెనూ ఏ మాత్రం పాటించడం లేదని గ్రామస్థులు వాపో తున్నారు. శనివారం వెజిటేబుల్‌ రైస్‌, సాంబార్‌, పాయసం చేయాల్సి ఉండగా, అన్నం, నీళ్ల చారు. పాయసం అంటూ ఏదో ఓ వంటకం చేసి మమ అనిపించారు. ఈ భోజనాన్ని కొందరు విద్యార్థులు తినగా మిగతా పిల్లలు పాఠశాల ఆవరణలోనే పాడేయడం కనిపించింది. రుచి, శుచి లేకుండా వంట చేయడంపై ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా కూరగాయలు తేలేదని, అందుకే అన్నం, చారు చేశామని నిర్వాహకులు తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి కదా అని అడగగా పిల్లలకు ఏదో ఒక్కటి వడ్డీంచ్చాం కదా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై హెచ్‌ఎం జయరాజును వివరణ కోరగా ప్రతిరోజూ భోజనం బాగుంటుందని, ఈ రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ ఉండడంతో నేను అక్కడికి వెళ్లడంతో వంట ఇలా చేశారాని తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:03 AM

Advertising
Advertising