ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘కౌంటర్‌’కు ఇంకెంత టైం కావాలి?

ABN, Publish Date - Mar 06 , 2024 | 03:59 AM

పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్‌ వేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటారని మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

సీబీఐ ఎస్పీ, వివేకా కుమార్తె కేసులో కృష్ణారెడ్డి తరఫు లాయర్‌కు హైకోర్టు ప్రశ్న

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్‌ వేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటారని మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్‌ వేసేందుకు పలుమార్లు సమయం ఇచ్చినా ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. కౌంటర్‌ వేయాలని కృష్ణారెడ్డిని ఆదేశిస్తూ విచారణను మార్చి 13కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి ఎస్పీ రామ్‌సింగ్‌ కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని, లేకుంటే హత్య కేసులో ఇరికిస్తామని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి జనవరి 4లోగా తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ సహా సునీత, రాజశేఖరరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా చార్జ్‌షీట్‌ వేశారు. పులివెందుల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు, దాని ఆధారంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వీరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఈ దశలో ఫిర్యాదుదారుడు కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి స్పందిస్తూ.. కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్‌ దాఖలు చేయకుండా గత మూడునెలలుగా సమయం కోరుతున్నారన్నారు. పోలీసులు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ట్రయల్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మరోసారి స్పందిస్తూ.. పోలీసులు వేసిన చార్జిషీట్‌ను ట్రయల్‌ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:02 AM

Advertising
Advertising