ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ABN, Publish Date - Mar 09 , 2024 | 12:10 AM
పట్టణంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మదనపల్లె అర్బన, మార్చి 8: ఇందులో భాగంగా మదనపల్లె పట్టణ వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మహిళా సభ్యురాలు 45 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన డాక్టర్ నీరజా ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ మహిళా అభివృదిఽ్ధకి, సాధికారతకు ఐక్యంగా కృషి చేయాలన్నారు. మహిళలు చదువు కుంటే భవిష్య తలో ఉన్నత స్థానంలో తన కాళ్లపై తానే నిలబడుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాసవీక్లబ్ సభ్యులు శ్రీనాథ్, పి. అమరనాథ్, లక్ష్మీదీపక్, వీవీ కృష్ణారావు, వాసవీక్లబ్ మహి ళా సభ్యురాలు, వాసవీ వనితా క్లబ్ సభ్యురాలు పాల్గొన్నారు. అలాగే కోళ్లబైలు పంచా యతీ వెలుగు ప్రత్యేక పాఠశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుర్కరించుకుని మదనపల్లె స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు ధాత్రిఫౌండేషన డైరెక్టర్ డాక్టర్ స్వాతి, గ్రామజ్యోతి సొసైటీ డైరెక్టర్ సుభద్ర, చైతన్య ఆశ్రమం ిప్రన్సిపాల్ కవితారాణిలను వెలుగు సంస్థ కన్వీనర్ బాగ్యలక్ష్మీ, వెలుగు సెక్రటరీ ఉదయ్‌మోహనరెడ్డి, మహిళలను సన్మా నించారు. స్థానిక బాలాజీ నగర్ పాఠశాలలో ఎస్టీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెకల మధుసూదన, అమరనాథ్, ఈశ్వర్‌నాయక్, ప్రసాద్, ఆనంద్, శారఫతఅలీఖాన, రవీంద్రా రెడ్డి, అల్తాప్ బాషా పాల్గొన్నారు.
పీలేరులో టీడీపీ ఆధ్వర్యంలో..
పీలేరు, మార్చి 8: పీలేరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీ య మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పీలేరు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు పురం రెడ్డమ్మ, పీలేరు నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్య క్షురాలు సాధన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల మానసపుత్రిక అయిన ‘కలలకు రెక్కలు’ పథకంతో హద్దులు లేని మహి ళాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇటీవల వారు ‘కలలకు రెక్కలు’ పథకం తెచ్చా రన్నారు. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డా ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కలలతో రాజీపడ కుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఆ పథకం అడుగులు వేయిస్తుందన్నారు. ఆ పథకం ద్వారా ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఆడబిడ్డా ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారన్నారు. ఆసక్తి గల వారు ‘కలలకు రెక్కలు.కామ్’ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవా లన్నారు.. రిజిసే్ట్రషన్ లింక్ పొందడానికి 92612 92612 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసుకుని అందరికీ పంచి పెట్టారు. కార్యక్రమంలో రమాదేవి, లక్ష్మీకాంతమ్మ, దేవమ్మ, చందన, రెడ్డిరాణి, హేమావతి, వాణి, షమ, చంద్రలేఖ, అనూ రాధ, కాంతమ్మ, విజయ, రక్షిత, వనిత, రజిత, సుశీలమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Updated Date - Mar 09 , 2024 | 12:11 AM