ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చేతికో ట్యాగ్‌.. కవర్‌

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:43 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ఆయన మేనత్త వైఎస్‌ విమలారెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. గురువారం స్థానిక ఫంక్షన్‌ హాలులో

జగన్‌ మేనత్త విమలారెడ్డి ఆధ్వర్యంలో పాస్టర్లతో భేటీ

రవాణా ఖర్చుల పేరిట తలా 1000 పంపిణీ

వెంట వచ్చిన సాధారణ సభ్యులకు రూ.500

పరోక్షంగా వైసీపీకి మద్దతుగా పలువురు ప్రసంగం

పాడేరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ఆయన మేనత్త వైఎస్‌ విమలారెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. గురువారం స్థానిక ఫంక్షన్‌ హాలులో ‘అల్లూరి జిల్లా సేవకుల సదస్సు’ పేరిట ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోయినా, క్రిస్టియన్‌ మైనారిటీ సంఘాల పెద్దలుగా ఉన్న జాన్‌ వెస్లీ, జాన్‌సన్‌లు పరోక్షంగా వైఎస్‌ జగన్‌కు మద్దతుగా ప్రసంగించారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా ఉందని, భవిష్యత్తులో సైతం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన పాస్టర్లకు రవాణా ఖర్చుల పేరిట తలా రూ.వెయ్యి, వారి వెనుక వచ్చిన సాధారణ సభ్యులకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. డబ్బులు పంపిణీ కార్యక్రమం కోసం (ఒకసారి తీసుకున్నవారు రెండోసారి తీసుకోకుండా) ప్రతి ఒక్కరి చేతికి ట్యాగ్‌ వేశారు. సమావేశం అనంతరం ఆ ట్యాగ్‌ను కట్‌ చేసిన తర్వాత వారికి డబ్బులున్న కవరు అందజేశారు. జిల్లాలోని పాస్టర్లందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ కొందరు రాలేదు. పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు హాజరు కాగా, వారిలో మూడొంతులు సాధారణ సభ్యులు, ఒక వంతు పాస్టర్లు ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 03:43 AM

Advertising
Advertising