ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బుచ్చిబాబు, వేగుళ్లకు అభినందనల వెల్లువ

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:48 AM

బుచ్చిబాబు, వేగుళ్లకు అభినందనల వెల్లువ

మండపేట, ఫిబ్రవరి 25: టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్య ర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును పేరు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వేగుళ్లను పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చి పూలమాలలతో సత్కరించారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు మండపేట పార్టీ కార్యాలయానికి చేరుకుని వేగుళ్లకు అభినందనలు తెలిపారు. పలువురు పూలమా లలు, శాలువాలతో సత్కరించారు. స్వీట్స్‌ తినిపించి ఆనం దాన్ని వేగుళ్లతో పంచుకున్నారు. నాల్గవసారి వేగుళ్లను భారీ మెజార్టీతో గెలిపిస్తామని టీడీపీ శ్రేణులు చెప్పారు.

బుచ్చిబాబుకు టికెట్‌ కేటాయింపుపై హర్షం

ఐ.పోలవరం, ఫిబ్రవరి 25: టీడీపీ, జనసేన కూటమి ముమ్మిడివరం అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబును ప్రకటించ డంతో మురమళ్ళ క్యాంపు కార్యాలయం వద్ద రెండు రోజులుగా సందడి నెలకొంది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం ఏర్పడింది. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి బుచ్చిబాబును అభినందించారు. టీడీపీ-జనసేన పొత్తును ప్రజలు కోరుతున్నారని బుచ్చిబాబు అన్నారు. తెలుగుదేశం-జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో వైసీపీలో వణుకు ప్రారంభమైందన్నారు. చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, నాగిడి నాగేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, దొమ్మేటి రమణకుమార్‌, ధూళిపూడి బాబి, ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, కట్టా సత్తిబాబు, వెంటపల్లి ఉమామహేశ్వరి, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, పితాని నరసింహమూర్తి, అధిక సంఖ్యలో అగ్నికులక్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:48 AM

Advertising
Advertising