సైకిల్ ఎక్కేద్దాం
ABN, Publish Date - Mar 01 , 2024 | 01:13 AM
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డ వేళ జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ఊపందుకుంటున్నాయి. అధికార వైసీపీకి పార్టీ నేతలు, క్యాడర్ ఎక్కడికక్కడ బైబై చెప్పేసి టీడీపీలో చేరిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునిగి పోవడం ఖాయమని తేలిపోవడంతో ఫ్యాన్‌ను వదిలేసి సైకిల్ ఎక్కేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా నిత్యం టీడీపీలోకి వందలాది మంది వైసీపీ నేతలు, క్యాడర్ చేరికలు జాతరను తలపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో టీడీపీలోకి భారీ చేరికలు
నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ వందల్లో క్యూకడుతున్న వైసీపీ క్యాడర్
ప్రజావ్యతిరేకతతో వైసీపీ మునిగిపోవడం ఖాయమని తేలడంతో ముందే జంప్
ఎంపీపీలు మొదలు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు భారీ క్యూ
పార్టీ క్యాడర్‌కు ఇబ్బంది లేకుండా ఆచితూచి చేర్చుకుంటున్న టీడీపీ ఇన్‌ఛార్జులు
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట వైసీపీ దాదాపుగా ఖాళీ
ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ కోసం పరోక్షంగా పనిచేయడానికి సై
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డ వేళ జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ఊపందుకుంటున్నాయి. అధికార వైసీపీకి పార్టీ నేతలు, క్యాడర్ ఎక్కడికక్కడ బైబై చెప్పేసి టీడీపీలో చేరిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునిగి పోవడం ఖాయమని తేలిపోవడంతో ఫ్యాన్‌ను వదిలేసి సైకిల్ ఎక్కేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా నిత్యం టీడీపీలోకి వందలాది మంది వైసీపీ నేతలు, క్యాడర్ చేరికలు జాతరను తలపిస్తున్నాయి.
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వద్దన్నా వెల్లు వలా రాజీనామాలు చేసి వ చ్చేస్తోన్న నేతలు, క్యాడర్‌ను చేర్చుకోలేక టీడీపీ ఎక్కడి కక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతోం ది. ఇందులోభాగంగా చేరికల కు ఏకంగా తేదీలు నిర్ణయిం చుకుని చేరికలు చేసుకోవాల్సి వస్తుండడం ఖాళీ అయిపోతు న్న వైసీపీ దుస్థితిని చాటు తోంది. ప్రధానంగా ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే సిన ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వంతో ఇమడ లేక వేలాదిమంది వైసీపీ క్యాడర్ గడచిన నెలన్నరలో భారీగా టీడీపీలోకి చేరిపోయారు. మిగిలిన నియోజకవర్గాల్లోను ఎమ్మెల్యేలు ఎంత ఆపే ప్రయత్నం చేస్తున్నా ఇమడలేక సైకిల్ ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ము ఖ్యంగా ఎంపీపీలు, సర్పంచ్‌లు అయితే తమకు గౌరవం లేకుండా చేసిన పార్టీలో ఉండలేక టీడీపీకి క్యూ కట్టేస్తున్నారు. మండలాల్లో సీనియర్ నేతలు, ఇతర క్యాడర్ అయితే పార్టీలో ఎన్నో ఏళ్లనుంచి పనిచేస్తున్నా గుర్తింపునకు నోచు కోకపోవడం, తమకంటే వలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుండడంతో వారు కూడా బైబై చెప్పేస్తున్నారు. వీటికి అడ్డుకట్టవేయలేక వైసీపీ తలపట్టుకుంటోంది.
ఉండలేం.. వదిలేద్దాం..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో అధికార వైసీపీలో అంతకంతకు కుదు పులు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీ పరాజయం ఖాయమన్న అంచనాలతో ఆ పార్టీలో అనేకమంది నేతలు రాజకీయ భవిష్యత్తుకోసం ఇప్పటి నుంచే సైకిల్ ఎక్కేస్తున్నారు. ఒకపక్క జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడం, అటు టీడీపీ, జనసేన కూటమి భారీ విజయం సాధించడం ఖాయ మన్న సర్వేలు, ఇతర అంచనాలతో వైసీపీని పెద్దఎత్తున వీడిపోతున్నారు. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే లెక్కలతో వరుసగా సైకిల్ ఎక్కేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీనుంచి వందలా దిగా నేతలు, క్యాడర్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. షర తులతో సంబంధం లేకుండా పార్టీలోకి వెల్లువలా వచ్చి చేరుతున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అవుతోంది.
నియోజకవర్గాలవారీగా..
జగ్గంపేట నియోజకవర్గంలో గడచిన రెండు నెలల్లో నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో వైసీపీ ని వీడిపోయి వందలాదిమంది క్యాడర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరిలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, వివిధ పార్టీ విభాగాల నేతలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఉన్నారు. వీరందరినీ ఒకేసారి చేర్చుకోలేక ఒక్కో మండ లానికి ఒక్కో తేదీ కేటాయిస్తూ మాజీ ఎమ్మెల్యే నెహ్రూ ఆఽధ్వర్యంలో సైకిల్ ఎక్కుతున్నారు. ప్రధానంగా ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును తప్పించి ఆయన స్థానంతో మాజీమంత్రి తోట నరసింహానికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో గురుగ్రా ఉన్న వైసీపీ క్యాడర్ ఇప్పటికే పెద్దఎత్తున టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే చంటిబాబు వర్గం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది.
ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ టిక్కెట్ చించేయడంతో ఆయన అనుకూల వర్గం అంతా రాజకీయ భవిష్యత్తుకోసం టీడీపీలో చేరిపోయారు. దీంతో ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
పిఠాపురంలో వైసీపీకి కిందిస్థాయి క్యాడర్ షాక్ ఇచ్చింది. ఇక్కడ టీడీపీ గెలు పు ఖాయమని తేలడం, ఎమ్మెల్యే దొరబాబును తప్పించి వైసీపీ టిక్కెట్ వంగా గీతకు ఇవ్వడంతో ఇది సహించలేని అనేకమంది వైసీపీ నేతలు, క్యాడర్ రెండు నెలలుగా వందల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో సైకిల్ ఎక్కేశారు.
తునిలో మంత్రి రాజా తీరు నచ్చకపోవడం, తమకంటే వలంటీర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడం, పార్టీ ఈసారి గెలవదనే లెక్కలతో తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లో వందలాదిమంది వైసీపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరిపోయారు.
పెద్దాపురం, కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోను అక్కడ వైసీపీ ఇన్‌ఛార్జులతో వేగలేకపోవడం, వైసీపీకి గడ్డు పరిస్థితులు తలెత్తడంతో గెలిచే పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసం వందలాదిమంది టీడీపీలో చేరారు. టీడీపీలోకి అవకాశం లేని నేతలు, క్యాడర్ జనసేనలోను భారీగా చేరుతున్నారు.
జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అధికార వైసీపీ తరఫున గెలిచిన సర్పంచ్‌లైతే గడచిన కొన్నినెలల్లో ఆ పార్టీకి భారీగా రాజీనామా చేసేశారు. వైసీపీ తరఫున గెలిచినా ఇంతకాలంగా తమకు ఏ విలువ లేకుండా చేశారని కొంతకాలంగా వీరు రగిలిపోతున్నారు. నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారని, అదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు విలువ పెరుగుతుందనే నమ్మకంతో జిల్లావ్యాప్తంగా భారీగా టీడీపీలో చేరారు.
ఆ ఊపుతో ఇంకా..
మరోపక్క ఇటీవల టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించి న నేపథ్యంలో మరింత భారీ ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో వైసీపీనుంచి ఇంకా వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. అనేకమంది పార్టీలో చేరడానికి టీడీపీ కీలక నేతల ద్వారా నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు టచ్‌లోకి వస్తున్నారు. భవిష్యత్తులో పదవులు అక్కర్లేదని, పార్టీలో చేర్చుకుంటే చాలంటూ రాయబారాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ సైకిల్ ఎక్కడానికి సిద్ధపడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తల విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. స్థానిక నాయకత్వానికి ఇబ్బందులు లేకుండా వారితో సంప్రదిం పులు చేస్తూ ముందుకు వెళ్తోంది. మున్ముందు ఈ వలసలు ఇంకా పెరిగే అవ కాశం ఉండడంతో వ్యూహాత్మకంగా టీడీపీ ఇన్‌ఛార్జులు ముందుకు వెళ్తున్నారు.
వైసీపీని ఓడించాలని..
ఇటీవల వైసీపీలో టిక్కెట్‌లు కోల్పోయిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఇప్పటికే తమ క్యాడర్‌ను టీడీపీకి పంపేశారు. అటు వీరు కూడా ఎన్నికల్లో పరో క్షంగా టీడీపీకి సహకరించాలని నిర్ణయించారు. తమను అవమానించి టికెట్ లేకుండా చేసిన వైసీపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపు తున్నారు. కాగా కళ్లముందే ఖాళీ అవుతోన్న క్యాడర్‌ను చూసి వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. వారిని ఆపడం ఎలాగో తెలియక బతిమాలుకుంటున్నారు. ఏదో పొరపాటు అయిందని, తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నా ఎవరూ వినకుండా సైకిల్ ఎక్కేస్తుండడంతో తలపట్టుకుంటున్నారు. టీడీపీకి పోటీగా నియోజకవర్గాల్లో కొత్త నేతలు, క్యాడర్‌ను చేర్చుకుని వైసీపీ కండువా కప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా చేరే వారు కరువవడంతో బేల చూపులు చూస్తున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 01:13 AM