బలంగా ఢీ.. కొట్టాల్సిందే
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:16 AM
జిల్లాలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇంకా ప్రకటిం చని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మరింత వేగంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల తుని, జగ్గంపేట, పెద్దాపురం సీట్లు ప్రకటించగా పొత్తులో భాగం గా జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్న సీట్లలో గెలుపు గుర్రాల ఎంపికపై కూలంకషంగా వడపోత పోస్తోంది.
జిల్లాలో మిగిలిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై టీడీపీ ఎడతెగని కసరత్తు
ప్రకటించాల్సిన సీట్లలో గెలుపుగుర్రాల ఎంపికపై కొనసాగుతున్న వడపోత
కాకినాడ సిటీ స్థానం పరిశీలనలో పలువురి పేర్లు
ద్వారంపూడిని ఢీకొట్టే ధీటైన అభ్యర్థి ఎంపికకోసం సుదీర్ఘ కసరత్తు
తొలుత పవన్ అనుకున్నా పిఠాపురం ఖాయమవడంతో మల్లగుల్లాలు
ఆర్థిక బలమున్న అభ్యర్థి అయితేనే సిటీలో ఢీకొట్టగలమని పార్టీ ఆలోచన
పిఠాపురం నుంచి పవన్ నిలబడితే వర్మను ఏం చేయాలని ఆలోచన
పవన్ పోటీ చేయకపోతే వర్మకే సీటు.. అటు ప్రత్తిపాడు సీటు సత్యప్రభకే
జిల్లాలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇంకా ప్రకటిం చని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మరింత వేగంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల తుని, జగ్గంపేట, పెద్దాపురం సీట్లు ప్రకటించగా పొత్తులో భాగం గా జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్న సీట్లలో గెలుపు గుర్రాల ఎంపికపై కూలంకషంగా వడపోత పోస్తోంది.
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు సీట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఇం దులో పిఠాపురం నుంచి పవన్‌కళ్యాణ్ దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాకినాడ సిటీ, ప్రత్తిపాడు సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిని ఢీకొట్టే బలమైన నేత విష యంలో పార్టీ సుదీర్ఘ కసరత్తు జరుపుతోంది. తొలుత ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పిఠాపురం ఖాయం కావడంతో ద్వారంపూడిపై పోటీ చేసే నేతను ఎం పిక చేసే విషయమై ఆచితూచి అగుడులు వేస్తోంది. ధన బలం, కండబలం పుష్కలంగా ఉన్న ద్వారంపూడిపై పోటీ చే సే అభ్యర్థి కూడా అదేస్థాయిలో ఉంటేనే అనుకున్న ఫలితం రాబట్టవచ్చని ఆలోచిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కొండ బాబు, గుణ్ణం చంద్రమౌళి, సుస్మిత, పావని తదితర పేర్లపై ఐవీ ఆర్‌ఎస్‌తోపాటు సర్వే నివేదికలు రప్పించుకుని పరిశీలిస్తోం ది. పిఠాపురంనుంచి పవన్ పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే వ ర్మను ఎలా గౌరవించాలనే దానిపైనా బేరీజు వేస్తోంది. ప్రత్తి పాడు సీటు వరుపుల సత్యప్రభకే ఖాయమైనా జనసేన అ డుగుతుండడంతో తాత్కాలికంగా ప్రకటన వాయిదా వేసింది.
ఆచితూచి.. బేరీజు వేసి..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల ను దించడానికి భారీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు, ఆర్థికంగా వైసీపీని ఢీకొట్టే సామర్ధ్యం, సామాజిక సమీకరణాలు తదితర అన్ని కోణాల్లో లెక్కలు వేసి ఎంపిక చేస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల పెద్దా పురం, జగ్గంపేట, తునిస్థానాల్లో చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య పేర్లు ప్రకటించింది. జనసేననుంచి కాకినాడ రూరల్ సీటుకు పంతం నానాజీ పేరును ఖాయం చేసింది. దీంతో ఇంకా కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి టీడీపీ అధిష్ఠానం భారీ కసరత్తు చే స్తోంది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు నుంచి జనసేన తరఫున పవన్‌కళ్యాణ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలమైన నేతగా ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఏం చేయాలనే దానిపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చే అంశంపై పరిశీలిస్తోంది. ఒకవేళ పవన్ పోటీ చేయకపోతే వర్మ టీడీపీ అభ్యర్థిగా కొన సాగనున్నారు. ఒకవేళ పవన్ కాకినాడ ఎంపీగా బరిలోకి దిగుతారని కూడా బలంగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పిఠాపురం సీటు వర్మకే కొనసాగనుంది.
ద్వారంపూడిని ఓడించాలని..
కాకినాడ సిటీ నియోజకవర్గం విషయంలో టీడీపీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్నా రు. ఈయన్ను ఎట్టిపరిస్థితుల్లో ఓడించి తీరుతానని పవన్‌కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ద్వారంపూడి ఈ ఐదేళ్లలో అధి కారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపో యారు. రామేశంమెట్ట నుంచి రియల్ ఎస్టేట్, వ్యాపారులపై వేధింపులు, అధికారుల సొంత పనులు చక్కబెట్టుకోవడం ఒక టేంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు మినీ సీఎంగా వ్యవహరించారని టీడీపీ, జనసేనలు ఇప్పటికే ధ్వజమెత్తుతున్నాయి. పైగా ద్వారంపూడి సైతం ముఖ్యనేత అండతో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌ను గతంలో దారుణంగా బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలని టీడీపీ, జనసేనలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కొండబాబును బరిలోకి దించాలని భావిస్తున్నా ఆయన ద్వారా ద్వారంపూడిని ఢీకొట్టడం అంత తేలిక కాదని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడి కోడలు సుస్మిత, పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత గుణ్ణం చంద్రమౌళి, మాజీ మేయర్ పావని పేర్లను పరిశీలిస్తోంది. వీరికి సంబంధించి ఐవీఆర్‌ఎస్ సర్వేలు, ఇతర నివేదికలు రప్పించుకుంది. వీరిలో మౌళి ఆర్థికంగా, స్థానిక బలం పరంగా ధీటుగా ఉంటారని భావిస్తోంది. ఈ సీటు మత్స్యకార సామాజికవర్గానికే ఇవ్వాల్సి ఉండడంతో ఏం చేయాలనే దానిపై రకరకాలుగా బేరీజు వేస్తోంది. అటు ఆర్థికంగాను ఢోకా ఉండదనే లెక్కలు వేస్తోంది. అటు మత్స్యకారులకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సి ఉండడంతో కొండ బాబును కాదనలేని పరిస్థితి. అటు ఇదే సామాజికవర్గం నుంచి మహిళను నిలబెడితే క్యాడర్ పరంగా మద్దతు కష్టమవుతుందనే భావనతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
వైసీపీ వ్యూహాలు
మరోపక్క ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటమి భయంతో ద్వారంపూడి స్థానంలో ఆయన భార్య, లేదా కాపు సామాజికవర్గం నుంచి వేరొకరిని బరిలో నిలబెట్టించాలని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల వ్యూహంతో నియోజకవర్గంలో మత్స్యకారుల ఓట్లకు గేలం వేయడానికి గతేడాది వాడబలిజ సామాజికవర్గానికి చెందిన మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చి ఓట్లపై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాలను గమనిస్తూ ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీడీపీ లెక్కలు వేస్తున్న అభ్యర్థుల్లో ఎవరిని నిలబెట్టాలి అనేదానిపైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
పవన్ స్థానాన్ని బట్టి..
వాస్తవానికి పవన్ తొలుత కాకినాడ సిటీ నుంచి బరి లోకి దిగుతారని ప్రచారం జరిగింది. తద్వారా ద్వారంపూడి ఓటమి ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. కానీ పిఠా పురంనుంచి నిలబడతారనే తాజా అంచనాల నేపథ్యంలో కాకినాడ సిటీలో ద్వారంపూడిని ఢీకొట్టే సమర్ధ నేత ఎవర నేదానిపై ఇప్పుడు మళ్లీ వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. పవన్ కాకినాడ సిటీనుంచి నిలబడితే, అటు టీడీపీకి పిఠా పురం సీటు ఇబ్బంది ఉండదని, అప్పుడు అక్కడా, ఇక్కడా రెండుచోట్లా టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు పార్టీవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధిష్ఠానం అడుగులు ఎటుంటా యనేది ఆసక్తికరం గా మారింది. ప్రత్తిపాడునుంచి వరుపుల సత్యప్రభకే సీటు ఖాయంగా కనిపిస్తోంది. జనసేన ఈ సీటు కూడా కోరు తోంది. ఇప్పటికే కాకినాడరూరల్ సీటు ఆ పార్టీకి ఇచ్చారు. పిఠాపురం, కాకినాడ ఎంపీ సీటు కూడా జనసేనకు వెళ్తే ప్రత్తిపాడు టీడీపీకే ఉండిపోనుంది. ఈ చిక్కుముళ్లు తేల డానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
Updated Date - Mar 03 , 2024 | 12:16 AM