భార్యకు మందులు కొనలేక... భర్త ఆత్మహత్య
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:32 AM
భార్యకు మం దులు కొనుగోలు చేయలేక ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనపర్తి,మార్చి 2 : భార్యకు మం దులు కొనుగోలు చేయలేక ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనపర్తి ఏఎస్‌ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం. అనపర్తిలోని బాపనమ్మ ఆల యం సమీపంలో నివాసం ఉంటున్న సత్తి గంగిరెడ్డి(61) కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించేవా డు. ఇటీవల కాలంలో అతని భార్య అనారోగ్యం భారిన పడడం నెలసరి మందులు కొనేందుకు కూడా స్థోమత లేకపోవడంతో తీవ్ర మనస్తా పానికి గురయ్యాడు. ఇదిలా ఉండగా శనివారం అనపర్తి శివారులోని ఎఫ్‌సీఐ గొడౌన్స్ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో సపోట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకుని మృతుడు వివరాలకు ఆరా తీయగా గంగిరెడ్డిగా గుర్తించి బంధువులకు సమాచారం అందిం చారు. మృతుడి భార్య మంగయ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 12:32 AM