ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శివకోటిలో భారీ దొంగతనం

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:31 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో గాదె వెంకటసూర్యరామ మురళీకృష్ణ ఇంట్లో దొంగలు చొరబడి తాళాలు పగులకొట్టి, ఇంట్లో ఉన్న రూ.20లక్షల విలువచేసే బంగారం, వెండి, నగదును దోచుకువెళ్లారని శనివారం రాజోలు ఎస్‌ఐ జి.పృథ్వి తెలిపారు.

రూ.20లక్షలు విలువచేసే బంగారం, వెండి, నగదు అపహరణ

రాజోలు, మార్చి 2: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో గాదె వెంకటసూర్యరామ మురళీకృష్ణ ఇంట్లో దొంగలు చొరబడి తాళాలు పగులకొట్టి, ఇంట్లో ఉన్న రూ.20లక్షల విలువచేసే బంగారం, వెండి, నగదును దోచుకువెళ్లారని శనివారం రాజోలు ఎస్‌ఐ జి.పృథ్వి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మురళీకృష్ణ కుటుంబ సభ్యులు గత నెల 28న కుటుంబ సభ్యులతో వివాహ వేడుకకు మచిలీపట్నం వెళ్లారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపులు బద్దలకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును దొంగలు దోచుకువెళ్లారు. దీంతో దొంగతనం జరిగిందని భావించిన మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి రాజోలు ఎస్‌ఐ పృథ్వి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీములు చేరుకుని ఆధారాలు సేకరించారు. మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పృథ్వి తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:31 AM

Advertising
Advertising