ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమానుషం

ABN, Publish Date - Feb 03 , 2024 | 12:56 AM

ప్రశాంతమైన గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని అశాంతి అభద్రత చోటు చేసుకుంది.. రోజురోజుకు గోదా వరి జనం వికృత చేష్టలకు పాల్పడుతూ గోదావరి జిల్లాల ప్రశాంతతకు భంగం కలిగిస్తు న్నారు. సీతానగరం మండలం పెదకొండేపూడిలో శుక్రవారం జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ.

శిరోముండనం అయిన తరువాత ఆశ

తూర్పున రెండో శిరోముండనం కేసు

ఏలుకోమంటే భార్యకే గుండుకొట్టాడు

నీ దిక్కున్న చోట చెప్పుకోమని హెచ్చరిక

పెదకొండేపూడిలో ఘటన

కన్నీరుమున్నీరైన వివాహిత

జిల్లాలో చర్చనీయాంశం

రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి) : ప్రశాంతమైన గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని అశాంతి అభద్రత చోటు చేసుకుంది.. రోజురోజుకు గోదా వరి జనం వికృత చేష్టలకు పాల్పడుతూ గోదావరి జిల్లాల ప్రశాంతతకు భంగం కలిగిస్తు న్నారు. సీతానగరం మండలం పెదకొండేపూడిలో శుక్రవారం జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ. ప్రేమించి పెళ్లాడిన భార్య తనను ఏలుకోమన్నం దుకు ఒక భర్త శిరోముండనం చేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ హెచ్చరించి వెళ్లిపోయాడు. పాపం ఎవరూ లేని మహిళ పోలీసులను ఆశ్ర యించింది. హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యువతి షేక్‌ ఆశ హైదరాబాద్‌ ఫిల్మ్‌సిటీలో జూని యర్‌ ఆర్టిస్ట్‌గా ఉండగా,ఇతర సినీ యూనిట్‌లో అసి స్టెంట్‌గా పెదకొండేపూడికి చెందిన కర్రి రాం బా బు అనే అభిరామ్‌ ఉండేవాడు. ఇద్దరికి ఏర్ప డిన పరిచయం ప్రేమకు దారితీసింది.. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఒక అబ్బాయి పుట్టాడు.ఆ తర్వాత రాంబాబు తన భార్య, పిల్లా డిని వదిలేసి సొంతూరు పెదకొండేపూడి వచ్చే శాడు.తర్వాత ఆశ వచ్చినా కాపురం కుదరక పోవడంతో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. అయినా ఇంతవరకూ పోలీసులేమీ చర్య లు తీసుకోలేదు. ఇటీవల ఆమె స్వయంగా భర్త ఇంటికి వెళ్లింది. దీంతో భర్త, అతని తల్లిదం డ్రులు ఇంటికి తాళాలు వేసుకుని వేరేచోటికి వెళ్లి పోయా రు.ఆశ గేటు తాళాలు బద్దలు కొట్టుకుని అక్కడే ఉంటుంది.ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం భర్త వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. అతను ఆమె ను కింద పడేసి మెడమీద కాలు పెట్టి, టిమ్మర్‌తో ఆమెకు గుండు గీసేశాడు.ఆమె లబోదిబో మం టుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చేసరికి ఆమెను ఈడ్చుకుంటూ వచ్చి, జుట్టు అందరికీ చూపిస్తూ వెళ్లిపోయినట్టు ఓ వీడియో హల్‌ఛల్‌ చేస్తోంది.గుండు గీశాను. కేసు పెట్టుకో అని కూడా అతను హెచ్చ రిస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఆమె తర్వాత తన బిడ్డను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసింది.సీతానగరం ఎస్‌ఐ రామకృష్ణ ఆమెను రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి నింది తుడు అభిరా మ్‌ ను రిమాండ్‌కు పంపిస్తు న్నామని ఎస్‌ఐ చెప్పారు.

సీతానగరంలో రెండో శిరోముండనం

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ వచ్చాక ఇది రెండో శిరోముండనం. 2020లో జూలై20న సీతా నగరం మండలం మునికూడలిలో వరప్రసాద్‌ అనే దళిత యువకుడు ఇసుక అక్రమాలను అడ్డు కుంటున్నాడనే కారణంతో అతన్ని సీతానగరం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజా నగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిం దితులకు అండగా ఉన్నట్టు దళితులు అనేక సా ర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ కేసు ఇంకా పరిష్కారం కాకముందే,అదే మండలంలో షేక్‌ ఆశ కు భర్త శిరోముండనం చేశాడు. 1997లో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన సంగతి తెలిసిందే.ఆ కేసు ఇంకా నడుస్తోంది.

హైకోర్టు సీరియస్‌ అయిన మర్నాడే..

1997 నాటి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయా లని హైకోర్టు విశాఖలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టును గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. సీతానగరం మండలం మునికూడలికి చెందిన దళిత యువకుడు వరప్రసాద్‌ కేసుపై కూడా హైకోర్టు గురువారం సీరియస్‌ అయింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని శిరోముండన నిందితులు ఆరుగురు, ఎస్‌ఐతో సహా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిని హైకోర్టు కొట్టిపారేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసు కుంటే ఇటువంటి చెడు సంస్కృతి ప్రబలే అవకా శం ఉండదని ,పోలీసులు నిర్లక్ష్యం, రాజకీయనేతల అండవల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతు న్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

రెండు చేతులు వెనక్కి విరిచి గుండు గీసేశాడు..

రాజమహేంద్రవరం అర్బన్‌ : నా భర్త, మామలతో కలసి ఆ ఇంట్లో నాకు స్థానం కల్పించాలి. నా బిడ్డకు హక్కు కావాలి అని శిరోముండనం భాధితురాలు ఆశ కోరారు. మనకు గొడవలు వద్దు అని చెప్పి మా ఆయన నన్ను ఇంట్లోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక చెయ్యిపట్టుకుని లాక్కెళ్లి నడుం, మెడపై కూర్చుని, రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని గుండు గీసేశాడు. నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి అడ్డొస్తావా, నీకు తాళి కట్టానా ? సరదాగా సహజీవనం చేశాను, నువ్వు నా పెళ్లాం ఏంటి అన్నాడు. అందరూ నాకు సపోర్టు ఉన్నారు అంటూ నన్ను ఇలా చేశాడు అని రోదించింది.శిరోముండనానికి గురైన బాధితురాలు ఆశను ఉమెన్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు తమ పర్యవేక్షణలోకి తీసుకుని శుక్రవారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు.జీజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతున్న బాధితురాలిని రాజానగరం ఎమ్మెల్యే రాజా, గణేశ్‌ పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధితురాలికితోడుగా ఉంటాం అన్నారు. స్థానిక ముస్లిం నాయకులు ఆరీఫ్‌, ఇమామ్‌ మౌలానా బాధితురాలికి తోడ్పాటు అందించారు.సీతానగరం ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో జీజీహెచ్‌కు వచ్చారు. బాధితురాలిని రాజమహేంద్రవరంలోని స్టేట్‌హోంకు తరలిస్తున్నట్టు ఉమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు వెల్లడించారు.

Updated Date - Feb 03 , 2024 | 12:56 AM

Advertising
Advertising