ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సత్యదేవుడికి రూ.20కోట్లు ప్రసాద్‌ స్కీం నిధులు

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:12 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యదేవుడి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ పథ కం అయిన ప్రసాద్‌ స్కీం నిధులు ఎట్టకేలకు మంజూ రయ్యాయి.

మంజూరు చేస్తూ కేంద్రం ఆదేశాలు

అన్నవరం ఫిబ్రవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యదేవుడి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ పథ కం అయిన ప్రసాద్‌ స్కీం నిధులు ఎట్టకేలకు మంజూ రయ్యాయి. దాదాపు 8ఏళ్లుగా ఈ పథకం నిధులు కోసం భక్తులు, అధికారులు ఎదురుచూస్తున్నారు. 2015లో దీనిపై ప్రతిపాదన పంపించాలని కేంద్ర టూరిజం అధికారులు లేఖ రాయడంతో రాష్ట్ర టూరిజం అధికారులు దేవస్థానం అధికా రులు రూ.92కోట్ల పనులకు ప్రతిపాదన పంపించారు. వీటిని తగ్గించి పంపించాలని రూ.50కోట్లు మాత్రమే వస్తాయని తెలపడంతో మరోసారి కొన్ని పనులు తీసివేసి రూ.50కోట్లకు అంచనాలు పంపించారు. దీనిపై ఆశలు వదులుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో ప్రధానంగా అన్నదాన భవనం నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి రూ.10కోట్లు వ్యయం కానుండగా మిగిలిన రూ.10కోట్లతో అత్యవసర పనులకోసం చైర్మన్‌, సభ్యులతో ఈ నెల 7న జరిగే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారు.

Updated Date - Mar 01 , 2024 | 12:12 AM

Advertising
Advertising