ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సత్యదేవుడికి వెండి,బంగారు వస్తువుల అందజేత

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:13 AM

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శనివారం అన్నవరం దేవస్థానం వ్రతపురోహితులు సుమారు 1.75లక్షల విలువైన వెండి బకెట్‌, స్వామివారికి బంగారు నేత్రాలు, కనుబొమ్మలు,

అన్నవరం, మార్చి 2: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శనివారం అన్నవరం దేవస్థానం వ్రతపురోహితులు సుమారు 1.75లక్షల విలువైన వెండి బకెట్‌, స్వామివారికి బంగారు నేత్రాలు, కనుబొమ్మలు, మీశాలను అందజేశారు. వీటి ని ఈవో రామచంద్రమోహన్‌కు సంఘ ప్రతినిదులు ఈవో రామచంద్రమోహన్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఈవో వ్రతపురోహితలను అభినందించారు. ప్రతీఏటాదేవస్థానం వ్రతపురోహితులు సంఘం తరుపున స్వామి,అమ్మవార్లకు ఏదో ఒక వస్తువును అందించడం ఆనవాయితీగా చేస్తున్నారు.

సత్యదేవుడి సన్నిధిలో ఐపీఎస్‌ త్రివిక్రమ వర్మ పూజలు

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో ఐపీఎస్‌ అధికారి త్రివిక్రమవర్మ కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయ నకు ఆలయ ఈవో రామచంద్రమోహన్‌ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా ఈవో వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠకు సన్నాహాలు

సత్యదేవుడికి స్వర్ణ ద్వజస్థంభం ప్రతిష్ఠపై సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఒకదాత వీటిని తయారు చేయిస్తున్నారు. ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు ప్రతిష్ఠా కార్యక్రమాలు చేపట్టాలని పండితులు భావిస్తున్నారు. ఈనెల 7న జరిగే పాలకమండలి సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై ఈవో రామచంద్రమోహన్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, పండితులతో చర్చించారు. ద్వజస్థంభం లోపలికి ఏవిధంగా తీసుకుని రావాలి అనేదానిపై చర్చించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ అధికారులు రాంబాబు, ఉదయ్‌కుమార్‌ తదితరులున్నారు.

తిరుపతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

స్వామివారి ఆదాయం రూ.5,15,858

పెద్దాపురం, మార్చి 2: కాకి నాడజిల్లా పెద్దాపురం మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివా రం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారి దర్శనా నికి భక్తులు తెల్లవారు జాము నే బారులు తీరారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.4,11,640 అన్నదానవిరాళాలు రూ.95,518 ఆదా యం, కేశఖండనద్వారా రూ.8,400, తులాభారం రూ.300 వెరసి రూ.5,15,858 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. దేవస్థానం చైర్మన్‌ కర్రి జగదీష్‌, దేవస్థానం అర్చకులు పెద్దింటి నారాయ ణాచార్యులు, పురుషోత్తమాచార్యులు పాల్గొన్నారు.

భక్తుల తాకిడితో అప్పనపల్లి కిటకిట

మామిడికుదురు, మార్చి 2: భక్తుల తాకిడితో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం శనివారం కిటకిటలాడింది. వేకువజాము నుంచి భక్తులు వైనతేయ నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కొత్త, పాత గుడులు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం స్వామివారిని 3964మంది దర్శించుకుని 3012మంది అన్నప్రసాదం స్వీకరించారని, వివిధ ఆర్జిత సేవల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.2,51,139 ఆదాయంగా వచ్చిందని ఏసీ జి.మాధవి తెలిపారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

సిద్ధి వినాయకుడికి బంగారు పళ్లెం బహూకరణ

అయినవిల్లి, మార్చి 2: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారికి ఓ భక్తుడు బంగారు పళ్లెం, వెండి బిందెలను సమర్పించారు. వీరవల్లిపాలా నికి చెందిన సూతాపల్లి సత్యనారాయణ-బాలదుర్గాకుమారి దంపతులు శనివారం విఘ్నేశ్వరస్వామిని దర్శించి రూ.5.10లక్షల విలువైన 81.600 గ్రాముల బంగారు పళ్లెం, రూ.80వేలు విలువైన 1003 గ్రాముల వెండి బిందెను అందజేశారు. శ్రీవిఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు రూ.20వేలు విరాళంగా ఇచ్చారు. భక్త దంపతులకు అర్చకులు వేదఆశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ చైర్మన్‌ గుత్తుల నాగబాబు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మక్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా భీమశంకరస్వామి కల్యాణం

జగ్గంపేట, మార్చి 2: కాకినాడజిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్ధివ లింగం మహారుద్రాభిషేకం శనివారం 6వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్‌ పంచగవ్యప్రాసన, గోపూజ, మహావ్యాసము, రుద్రాభిషేకమ, బిల్వార్చన, కుంకుమార్చన, నవగ్రహ హోమం, వంటిపూజా కారర్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూమణి, జ్యోతుల నవీన్‌ లక్ష్మిదేవి, తోట సర్వారాయుడు సునీత దంపతులు పీటలపై కూర్చుని భీమశంకర్‌స్వామి వారి కల్యాణ ం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వవిద్యాల అధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్‌ అమర్‌ ఆలీషా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమర్‌ ఆలీషా మాట్లాడుతూ భగవంతుడు సంకల్పంతో ఈ కోటి మహా రుద్రాభిషేకం నిర్వహించడం ప్రతిరోజు ఏదో ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతిని తీసుకొచ్చి ఆశీస్సు లు అందించడం, భక్తితత్వాలు వినిపించడం ఓ మహోన్నత కార్యక్రమం అన్నారు. గోకవరంనకు చెందిన ఆధ్యాత్మిక భక్తుడు తోట సాయి శివతత్వం. రామతత్వం గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, ఎస్వీఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కుంచే రాజా, జీను మణిబాబు, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లిరాజు, పాఠంశెట్టి రవి, కుంచే రామకృష్ణ, సూంరపాలెం బాలు, సీఎం, పాఠంశెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:13 AM

Advertising
Advertising