దళితులకు తీరని అన్యాయం చేసిన వైసీపీ
ABN, Publish Date - Mar 02 , 2024 | 11:30 PM
పిఠాపురం, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమాన్ని అటకెక్కించారని, వారికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని అన్యాయం చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం స మీపంలోని పాత టీడీపీ కార్యాలయ ఆవరణలో శనివారం వర్మ ఆధ్వర్యంలో దళితగర్జన సభ ని ర్వహించారు. ఆయన మాట్లాడు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమాన్ని అటకెక్కించారని, వారికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని అన్యాయం చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం స మీపంలోని పాత టీడీపీ కార్యాలయ ఆవరణలో శనివారం వర్మ ఆధ్వర్యంలో దళితగర్జన సభ ని ర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శించారు. దళితుల ఓట్లుతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించి నిండా ముంచారని తెలిపారు. పేదలకు ఇళ్లస్థలాల విషయంలోనూ దళితులకు అన్యాయం జరిగిందన్నారు. దళితుల సంక్షేమానికి ఐదేళ్లల్లో ఒక్క రూపాయి వెచ్చించలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల దళితులతో పాటు గొల్లప్రోలు, కొత్తపల్లి మాజీ జడ్పీటీసీలు మడికి ప్రసాద్, బత్తుల చైతన్యరాజేష్, నాయకులు నూతాటి ప్రకాష్, దుర్గాడ విజయలక్ష్మి, బోడపాటి పద్మ ఉన్నారు.
Updated Date - Mar 02 , 2024 | 11:30 PM