టిడ్కో లబ్ధిదారులపై వైసీపీ కక్ష సాధింపు
ABN, Publish Date - Feb 29 , 2024 | 11:56 PM
పిఠాపురం, ఫిబ్రవరి 29: టిడ్కో అపార్ట్‌మెంట్లులో నివాసముంటున్న వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం గోర్స రోడ్డులో గల టిడ్కో అపార్ట్‌మెంట్లను ఆయన గురువారం పరిశీలించారు. అపార్ట్‌మెంట్లలో అడుగడుగునా సమస్యలే ఉన్నాయని, డ్రెయిన్లుల్లో పూడిక పేరుకుపోయిందని, పలు అపార్ట్‌మెంట్లుకు
పిఠాపురం, ఫిబ్రవరి 29: టిడ్కో అపార్ట్‌మెంట్లులో నివాసముంటున్న వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం గోర్స రోడ్డులో గల టిడ్కో అపార్ట్‌మెంట్లను ఆయన గురువారం పరిశీలించారు. అపార్ట్‌మెంట్లలో అడుగడుగునా సమస్యలే ఉన్నాయని, డ్రెయిన్లుల్లో పూడిక పేరుకుపోయిందని, పలు అపార్ట్‌మెంట్లుకు ఇంకా విద్యుత్ సౌక ర్యం కల్పించలేదని, చీకటిలో మగ్గుతున్నామని లబ్ధిదారులు వర్మకు మొరపెట్టుకున్నారు. అపార్ట్‌మెంట్లు వద్ద పాముల బెడద అధికంగా ఉందని, పాముకాటుకు గురై ఇద్దరు చనిపోయారని తెలిపారు. వర్మ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అపార్ట్‌మెంట్లును లబ్ధిదారులకు అప్పగించారని, అయితే సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అపా ర్ట్‌మెంట్లులో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు అందరికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వ కుంటే మున్సిపల్, విద్యుత్‌శాఖ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, గొర్ల సత్తిబాబు, పిల్లి రవికుమార్, కోళ్ల బంగారుబాబు, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, దుర్గాడ విజయలక్ష్మి, తిరుమలరావు, దాసం ప్రసాద్, వాసంశెట్టి సూరిబాబు ఉన్నారు.
Updated Date - Feb 29 , 2024 | 11:56 PM