ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలం

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:09 AM

గొల్లప్రోలు, మార్చి 5: దాళ్వా సాగుకు అవసరమైన నీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్ర తినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు 19,20వ వార్డుల్లో మంగళవారం సాయంత్రం శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇం

గొల్లప్రోలులో కరపత్రాలు అందజేస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు, మార్చి 5: దాళ్వా సాగుకు అవసరమైన నీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్ర తినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు 19,20వ వార్డుల్లో మంగళవారం సాయంత్రం శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాల క్యాలెండర్‌లను అందజేశారు. పు రుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా తా ము 2 పంటలకు పుష్కలంగా నీరు అందించేవారమని వర్మ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు చెల్లించకుండా సదరు పథకాన్ని మూలనపెట్టిందని దాని వల్లే సాగునీటి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, నగరపంచాయతీ మాజీ చైర్మన్‌ శీరం మాణిక్యం, బస్సా సత్యనారాయణ ఉన్నారు.

అండగా నిలవాలి

పిఠాపురం రూరల్‌, మార్చి 5: ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు అండగా నిలవాలని వర్మ సతీమణి లక్ష్మీదేవి కోరారు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందజేశారు. టీడీపీ మ ండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, నాయకులు ఎలుబండి రాజారవు, బాబులు, బర్ల అప్పారావు, మలిరెడ్డి వెంకటరమణ, సకుమళ్ల నాగబాబు, నంద్యాల నాగబాబు, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:09 AM

Advertising
Advertising