నిధులు, అనుమతుల్లేకుండా శంకుస్థాపనలా?
ABN, Publish Date - Mar 13 , 2024 | 01:23 AM
పిఠాపురం, మార్చి 12: ఎటువంటి అనుమతులు, నిధులు మంజూరు లేకుండానే అధికార వైసీపీ నేతలు శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇందుకు బాధ్యులైన మునిసిపల్, మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు కృతికాశుక్లాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే సాగునీటి సమస్య, గ్రామాల్లో కలుషిత జలాల సరఫరా గు
బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు
పిఠాపురం, మార్చి 12: ఎటువంటి అనుమతులు, నిధులు మంజూరు లేకుండానే అధికార వైసీపీ నేతలు శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇందుకు బాధ్యులైన మునిసిపల్, మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు కృతికాశుక్లాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే సాగునీటి సమస్య, గ్రామాల్లో కలుషిత జలాల సరఫరా గురించి కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ టీడీపీ హయాంలో పిఠాపురంలో కాపు, బీసీ కల్యాణమండపాలకు స్థలాలు కేటాయించి, నిధులు తెచ్చి తాము శంకుస్థాపన చేశామన్నారు. ఆ శిలాఫలకాలు పగులకొట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, కౌన్సిల్ అనుమతులు, ఎటువంటి నిధులు కేటాయింపు లేకుండానే ఉత్తుత్తి శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసగించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పిఠా పురం నియోజకవర్గంలో సుమారు 7వేల ఎకరాల్లో వరిపంట సాగునీరు అందక ఎండిపోతోందని, తక్షణం సాగునీరు అందించి పంటను కాపాడాలని కోరారు. టీడీపీ నేతలు అల్లుమల్లు విజయకుమార్, సకుమళ్ల గంగాధర్‌లు పాల్గొన్నారు.
Updated Date - Mar 13 , 2024 | 01:23 AM