నగరంలో బ్లేడ్ బ్యాచ్‌గాళ్లు 1180 మంది
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:30 AM
పోలీసు రికార్డుల ప్రకా రం బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తదితర అరాచక వ్యక్తులు నగరంలో 1180 మం ది ఉన్నారని, ఇప్పటికే సెంట్రల్ జైలులో 350 మంది ఉన్నారని ఎంపీ భరత్‌రామ్ పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్
రాజమహేంద్రవరం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పోలీసు రికార్డుల ప్రకా రం బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తదితర అరాచక వ్యక్తులు నగరంలో 1180 మం ది ఉన్నారని, ఇప్పటికే సెంట్రల్ జైలులో 350 మంది ఉన్నారని ఎంపీ భరత్‌రామ్ పేర్కొన్నారు. ఆయన 24వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. రంభ,ఊర్వశి,మేనక థియేటర్ల సమీపంలో ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ జట్టు కూలీలు బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని ఎంపీకి తెలిపారు. ఉపాధి కోసం ఎక్క డెక్కడి నుంచో వచ్చామని.. కష్టపడితే రోజుకు రూ.500 గిట్టుబాటు అవుతుందన్నారు. అవి కూడా రాత్రులు తాము ఇళ్లకు వెళ్లే సమయంలో బ్లేడ్‌బ్యాచ్‌గాళ్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.బ్లేడ్‌బ్యాచ్,గంజాయిబ్యాచ్, రౌడీషీటర్లను రాజకీయ నాయకులే పెంచి పోషిస్తున్నారని..వారి అండతోనే పేట్రేగిపోతు న్నారని కూలీలతో ఎంపీ అన్నారు. దీంతో ఆశ్చర్యపోవడం కూలీల వంతు అయింది.అసాంఘిక వ్యక్తుల నుంచి రక్షణ కల్పించే విషయాన్ని పక్కనబెట్టి ఎన్నికల ప్రసంగంతో సరిపెట్టడంతో కూలీలు విస్మయం వ్యక్తం చేశారు.
Updated Date - Mar 03 , 2024 | 12:30 AM