ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kidnap..Murder: విశాఖలో యువకుడి కిడ్నాప్.. చివరకు మర్డర్..

ABN, Publish Date - Mar 03 , 2024 | 09:36 AM

విశాఖ: నగరంలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరికు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. ఈనెల 26న వెడ్డింగ్ షూట్ ఉందని పవన్‌కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు.

విశాఖ: నగరంలో యువకుడి కిడ్నాప్ (Kidnap) వ్యవహారం చివరికు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ (Wedding shoot) నిమిత్తం తూర్పుగోదావరి (East Godavari) జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ (Photographer) సాయి పవన్ కల్యాణ్ హత్యకు (Murder) గురయ్యాడు. ఈనెల 26న వెడ్డింగ్ షూట్ ఉందని పవన్‌కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో ఫిబ్రవరి 29న తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. పవన్ కల్యాణ్ హత్యకు గురైనట్లు కనుగొన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కల్యాణ్ వాడుతున్న ఖరీదైన కెమెరా కోసమే హతమార్చారా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు సాయి పవన్ కళ్యాణ్ మొదటి పక్కన పాలెం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 03 , 2024 | 09:39 AM

Advertising
Advertising