ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎల్‌హెచ్‌బీ బోగీలు

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:24 AM

రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధునాతనమైన లింకె హాఫ్‌మన్‌ బచ్చ్‌ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటుచేశారు.

సామర్లకోట, మార్చి 3: రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధునాతనమైన లింకె హాఫ్‌మన్‌ బచ్చ్‌ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటుచేశారు. ఈ రైలు ఆదివారం నుంచి ప్రారంభించారు. కాకినాడ, సామర్లకోట రైల్వేస్టేషన్లకు ఈ మేరకు రైల్వే పీఆర్వో కార్యాలయం నుంచి ఆదేశాలు ఆదివారం అందాయి. ఆంధ్రజ్యోతి ఆ వివరాలను సేకరించింది. ఈ అధునా తన బోగీలను ప్రాఽథమికంగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గత ఏడాది జూలై నెలలో ప్రారంభించా రు. ఈ బోగీలు సత్ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను మార్పులు చేయడం కొనసాగించారు. అందులో భాగంగా కాకినాడ-లింగంపల్లి- కాకినాడల మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను అనుసంధానం చేశారు. ఈఅధునాతన బోగీలను జర్మనీ కొలాబ్రేషన్‌తో కపూర్తలాలో తయారుచేస్తున్నారు. ఈఅధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీ లతో ప్రయాణం ఎటువంటి కుదుపులు, సౌండ్స్‌ లేకుండా సాఫీగా సాగుతుంది. డబుల్‌ సస్పెన్షన్‌, డిస్క్‌, బ్రేకింగ్‌ విధానంతోనూ ఈ బోగీలలో ప్రయాణం మరింత ఉల్లాసాన్ని ఇస్తుందని రైల్వే అధికారి తెలిపారు. మొత్తం 24 బోగీలలో 22 బోగీలు ఎల్‌హెచ్‌బీ బోగీలే కావడం విశేషం.

Updated Date - Mar 04 , 2024 | 12:24 AM

Advertising
Advertising