ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ 5..జనసేన 2

ABN, Publish Date - Mar 11 , 2024 | 10:19 PM

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం, నిడదవోలు నియో జకవర్గంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నిడదవోలు నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ పోటీ చేయనున్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న దుర్గేష్‌

రాజమహేంద్రవరం లోక్‌సభ బీజేపీకే

పురందేశ్వరి పోటీ చేసే అవకాశం

తీరిన రూరల్‌ - నిడదవోలు పంచాయితీ

శేషారావును బుజ్జగించనున్న అధిష్ఠానం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం, నిడదవోలు నియో జకవర్గంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నిడదవోలు నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ పోటీ చేయనున్నారు. తెలుగుదేశం- జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం అధి కారికంగా ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన,బీజేపీ పొత్తు నేప థ్యంలో జనసేనకు జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇప్పటికే రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణను జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కందుల దుర్గేష్‌ రాజహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీచేయాలని మొదటి నుంచి భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ టీడీపీ-జనసేన పొత్తుల వల్ల రూరల్‌ సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి దక్కింది.ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ ఆలోచించి కందుల దుర్గేష్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయిం చడానికి తొలిజాబితా విడుదల చేసిన రోజునే నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ముందుగా చెప్పిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం రూరల్‌ సీటు దక్కకపోవడంతో మొదట్లో దుర్గేష్‌ కొంత ఇబ్బంది పడ్డారు. రూరల్‌ క్యాడర్‌ చాలా ఒత్తిడి తెచ్చింది. నిరసనలు, ఆందోళనలు చేసింది.అధిష్ఠానం సూచనలు మేరకు దుర్గేష్‌ రూరల్‌లోని జనసేన క్యాడర్‌, తన అభిమానులకు నచ్చచె ప్పారు.అదే సమయంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన అనుచ రులతో కలిసి నేరుగా దుర్గేష్‌ ఆఫీసుకు వెళ్లారు. ఇద్దరూ కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.దీంతో రూరల్‌లో సమస్య పరిష్కా రమైంది. దుర్గేష్‌కు నిడదవోలు సీటును అధికారికంగా ప్రకటించారు. కానీ నిడదవోలులో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బూరుగుపల్లి శేషారావు మళ్లీ పోటీ చేయాలని చూశారు.ఆయనతో పాటు సీనియర్‌ నేత కుందుల సత్యనారాయణ సీటు ఆశించారు. టీడీపీ- జనసేన అఽధిష్ఠానం నిర్ణయాన్ని ఇప్పటికే సీనియర్‌ నేత కుందుల సత్యనారా యణ స్వాగతించారు.శేషారావు అనుచరులు ఇంకా నిరాశలో ఉన్నా రు. శేషారావుకు నచ్చచెప్పే బాధ్యతను టీడీపీ అఽధిష్ఠానం తీసుకుంది. త్వరలో కందుల దుర్గేష్‌ కూడా శేషారావును కలిసే అవకాశం ఉంది.

టీడీపీకి ఐదు సీట్లు

తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు నేపథ్యంలో జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఒకటి రెండు స్థానాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపోమాపో తుది జాబితా రానుంది. ఇక లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ కూడా ఈ సీటును అడిగింది.బీజేపీకి ఇస్తే ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం ఉంది.

పార్టీ నిర్ణయమే శిరోధార్యం : దుర్గేష్‌

పార్టీ నిర్ణయం శిరోధార్యం. రూరల్‌ నుంచి టికెట్‌ ఆశించా. కానీ పొత్తులు, సమీకరణల నేపథ్యంలో నేను నిడదవోలు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. నిడదవోలు టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు సమర్థనేత, ఆయన సంపూర్ణ సహ కారాన్ని కోరుతున్నాను. త్వరలోనే ఆయననునేను నేరుగా కలుస్తా. రాజమహేంద్రవరం రూరల్‌లో క్యాడర్‌ తననే పోటీ చేయమని పట్టుపట్టినప్పుడు అధిష్ఠానం నిర్ణయం చెప్పి అందరినీ ఒప్పించా. నెమ్మదిగా బయటకు వస్తున్నారు. అందరూ గోరంట్ల బుచ్చయ్యచౌదరిని గెలిపిస్తారు. నిడదవోలులో కూడా అందరినీ ఒప్పించి, మెప్పిస్తా. తనకు నిడదవోలు ప్రజలు ,నేతలు కొత్త కాదు. ఇప్పటికే జనసేన ఇన్‌చార్జి, ఇతర క్యాడర్‌ నాకు మంచి మిత్రులే. పైగా నేను గతంలో పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అందరికీ పరిచయస్తుడినే. నిడదవోలు ప్రజలు తనను ఆశీర్వదిస్తారు. నిడదవోలు నియోజకవర్గస్థాయిలో ఓ మేనిఫెస్టోను అమలు చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ ఆయన బయోడేటా..

కందుల దుర్గేష్‌ ఏయూలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పార్టీని బలో పేతం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2014లో రాజమహేంద్రవర్గం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి 21,243 ఓట్లు సాధించారు. తర్వాత జనసేనలో చేరా రు. 2019లో రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి త్రిముఖ పోటీలో 42,685 ఓట్లు సంపాదిం చారు. దుర్గేష్‌ తాత పోతుల వీరభద్రరావు రాజమహేంద్రవరం మునిసిపల్‌ చైర్మన్‌గా మూడు సార్లు పనిచేశారు. 1962-67 లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు.

Updated Date - Mar 11 , 2024 | 10:19 PM

Advertising
Advertising