ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్వయం సహాయక సంఽఘాల మహిళలకు ఆర్థిక సాయం చెక్కు అందజేత

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:39 AM

యానాం ఎస్పీతో ఎస్పీ సతీష్‌కుమార్‌ సమీక్ష కాకినాడ క్రైం, మార్చి 7 : రానున్న సార్వత్రిక ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం మద్యం, నగదు అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు, చెక్‌ పోస్టుల వద్ద పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌సార్వత్రిక ఎన్నికల సక్రమ నిర్వహణకు పటిష్ట చర్యలు, మద్యం, నగదు, మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు మరిన్ని చెక్‌ పోస్టుల ఏర్పాటు కుమార్‌ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో యానాం ఎస్పీ రాజశేఖరన్‌తోపాటు ఎస్‌ఈబీ అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా మ ద్యం, నగదు, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న చెక్‌పోస్ట్‌లకు అదనంగా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పా టుచేసి, ప్లయింగ్‌ స్క్వాడ్‌, మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. కోరంగి పోలీస్‌స్టేషన్‌, యానాం పోలీస్‌స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన రోడ్లు, చిన్న రోడ్లలో ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నా రు. అక్రమ రవాణా నిరోధానికి యానాం, జిల్లా పోలీసులు పటిష్టమైన సమాచార వ్యవస్థ, పరస్పర సమాచార మార్పిడితో అక్రమ రవాణాను అడ్డుకోవచ్చని, అవసరమైన ఏర్పా ట్లుచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఎస్‌డీపీవో హనుమంతరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో అధికారుల అత్యుత్సాహం ఆహ్వాన పత్రికల్లో సీఎం జగన్‌, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు ఇదేం ప్రచారమంటూ భక్తుల మండిపాటు పిఠాపురం, మార్చి7: పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన పాదగయ క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవదాయశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ ఉత్సవాలకు ము ద్రించిన ఆహ్వాన పత్రికల్లో దేవుడి ఫోటోలతోపాటు ముఖ్యమంత్రి జగన్‌, దేవదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుల ఫొటోలను ప్రచురించారు. గతంలో ఆహ్వానపత్రికపై పేర్లు, కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి ఫోటోలు మినహా వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఫోటోలు ముద్రించే సంప్రదాయం లేదు. అయితే ఈసారి ఆహ్వానపత్రికల్లో సీఎం, మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలను ముద్రించడం విస్మయాన్ని కలిగించింది. అధికార వైసీపీ పాలకుల ప్రాపకం కోసమే దేవదాయశాఖ అధికారులు ఇలా చేశారంటూ భక్తులు మండిపడుతున్నారు. దేవుడి కార్యక్రమాలో ఇదేమి ప్రచారమంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఆహ్వానపత్రికల ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకున్నట్టు.. ఏం చేస్తున్నట్టు? ఉత్సవ విగ్రహాల్లా ఏఎంసీలు కానరాని రైతు అనుబంధ సేవలు స్థానిక సంస్థలకు కేటాయింపులు లేవు అడ్రస్‌లేని పశువైద్య శిబిరాలు వచ్చిన ఆదాయం నేరుగా ఖజానాకే దయనీయంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు పెద్దాపురం, మార్చి7 : వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు పూర్తిగా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాయి. ఏర్పాటు చేసిన లక్ష్యం మరిచాయి. రైతులకు కనీస స్థాయిలో సేవలు అంద జేయడం లేదు. గత నాలుగేళ్లుగా దయనీయంగా కొనసాగు తున్నాయి. ప్రతి ఏటా కోట్లలో ఆదాయం ఉంటున్నా రైతు అనుబంధ సేవలేవీ అందిన దాఖలాలు కనిపించడం లేదు. పశువైద్య శిబిరాలకుగానీ, స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కుగానీ ఒక్క రూపాయి కేటాయింపులు లేవు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 మార్కెట్‌ కమిటీల్లో ఈ పరిస్థితే కనిపి స్తోంది. వ్యవసాయ రంగాల సేవలకు సంబంధించి ప్రస్తా విస్తే మౌనమే అధికారుల నుంచి వచ్చే సమాధానంగా ఉం టోంది. సాధారణంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చెక్‌ పోస్టులు, గోదాముల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల రవా ణా సమయంలో సెస్‌ వసూళ్ల ద్వారా ఆదాయం సమకూరు తోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సమయంలో అత్య ధిక ఆదాయం సమకూరుతోంది. గోదాముల అద్దెల రూపేణా ఆదాయం వస్తోంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏఎంసీలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప గత ప్రభుత్వాలు అందించిన సేవలనూ కొనసాగించలేదు. వస్తున్న ఆదాయం కాస్తా నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్లిపోతోందని పలువురు రైతులే విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల వాటాలనూ చెల్లించడం లేదని తెలుస్తోంది. అటు రైతులకు సంబంధించి పశువైద్య శిబిరా లు, సీజన్ల వారీగా పశువులకు టీకాలు మందులు వేయడం లేదు. జిల్లాకు సంబంధించి 69 రహదారి పనులకు సంబంధించి రూ.37 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ ఒక్క పని కూడా పూర్తయినట్టు లేదు. దీంతో పొలాలకు వెళ్లే రహదారి మార్గాలు పూర్తి అధ్వానంగా మారిపోయాయి. దీం తో పంటల రవాణా సమయంలో రైతుల పాట్లు అన్నీఇన్నీ కావు. కేటాయింపులేవీ.. సాధారణంగా నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు ఏఎంసీ కార్యాలయాలుంటాయి. ఆయా ఏఎంసీలు పరిధిలో ఉండే మండ లాలకు ఆదాయంలో కొంతభాగం కేటాయించాలి. వెనుకబడిన గ్రామాలు, పూర్తి వ్యవసాయాధారిత పంచాయతీలకు ఏఎంసీ వాటా నిధులు కేటాయించాలి. గతంలో గ్రామాల్లో సీసీ రహదారు లు, కాలువలు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం ఈ నిధులు కేటా యించేవారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం ఈ నిధుల కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. నేడు ఏఎంసీల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతుండగా తిరిగి పైసా రావడం లేదు. ఆర్థిక సం ఘం సాధారణ నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లిస్తోంది.. ఏ ఎంసీ నిధులు ఒక లెక్కా అన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.

కాకినాడసిటీ, మార్చి7: మహిళా సాధికారిత

లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ఆర్థిక సహాయం ఆలంబనగా మహిళలు అన్ని రంగాల్లో నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలని కలెక్టర్‌ కృతికాశుక్లా కోరారు. గురు వారం అనకాపల్లి జిల్లా నుంచి సీఎం జగన్‌ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సాఆర్‌ చేయూత పథకం ద్వారా నాల్గవ విడత ఆర్థిక సాయా న్ని బటన్‌ నొక్కి అందించారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని గురువారం కలెక్టరేట్‌ నుంచి కృతికాశుక్లా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. జిల్లాకు చెందిన లబ్ధిదారులతో కలిసి వీక్షించారు. సీఎం బటన్‌ నొక్కిన అనంతరం జిల్లా లోని 1,01,759 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు

రూ.190 కోట్ల 80 లక్షల ఆర్థిక సహాయం పంపిణీ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కె శ్రీ రమణి, మెప్మా పీడీ బి ప్రియంవద, ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్చార్జి ఈడీ జె సత్యవతి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 01:39 AM

Advertising
Advertising