ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి టీడీపీ-జనసేనతో సాధ్యం

ABN, Publish Date - Mar 04 , 2024 | 01:02 AM

విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి, సంక్షేమం టీడీపీ-జనసేనతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం హోటల్‌ జగదీశ్వరీలో ఆదివారం పార్టీ తాడేపల్లిగూడెం పరిశీలకుడు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • 150 స్థానాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థులదే విజయం

  • విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సభలో టీడీపీ, జనసేన నేతలు

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 3: విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి, సంక్షేమం టీడీపీ-జనసేనతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం హోటల్‌ జగదీశ్వరీలో ఆదివారం పార్టీ తాడేపల్లిగూడెం పరిశీలకుడు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ జగన్‌ రాక్షస పాలనను అంతమొందించే సమయం వచ్చిందన్నారు. ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చినందుకు రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబును సీఎం చేయాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమికి 150 స్థానాలు వస్తాయన్నారు. తన భర్త ఆదిరెడ్డి వాసును రాజమహేంద్రవరం ప్రజలందరు ఆశీర్వదించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమం చూసింది టీడీపీ అన్నారు. రాష్ట్రంలో ఆదరణ పథకాన్ని తీసివేసిన జగన్‌ నవరత్నాలు పెట్టి అందులో మీ రత్నం ఎక్కడుందో వెతుక్కోమంటున్నాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కూటమి ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నగరంలో అన్ని సౌకర్యాలతో ఒక కమ్యూనిటీ హాలు నిర్మించడం, గోదావరి బండ్‌పై విశ్వబ్రహ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే తాను అనుశ్రీ సత్యనారాయణతో కలిసి విశ్వబ్రాహ్మణుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి పింఛను ఇచ్చే విషయాన్ని తమ నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ల దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం టీడీపీ-జనసేన కూటమితోనే సాధ్యమన్నారు. నక్కా చిట్టిబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు పాలవలస వీరభద్రం విశ్వబ్రాహ్మణుల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం నూతన కమిటీతో బుడ్డిగ రాధా ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో టీడీపీ నాయకులు యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్‌, నక్కా దేవివరప్రసాద్‌, కుడుపూడి సత్తిబాబు, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, మరుకుర్తి రవియాదవ్‌, సింహా నాగమణి, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు లక్కోజు వీరభద్రరావు, చించినాడ తాతాజీ, వీరమళ్ళ సత్తిబాబు, అములోజు శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 01:02 AM

Advertising
Advertising