ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళ మెడలో చైన్‌ లాక్కుని పరారీ

ABN, Publish Date - Feb 22 , 2024 | 01:40 AM

అనపర్తిలో బుధవారం తెల్లవారుజామున ఓ మహిళ మెడ నుంచి 28 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కొని పరారయ్యాడు. ఈ పెనుగులాటలో మహిళకు గాయాలయ్యాయి.

అనపర్తి, ఫిబ్రవరి 21 : అనపర్తిలో బుధవారం తెల్లవారుజామున ఓ మహిళ మెడ నుంచి 28 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కొని పరారయ్యాడు. ఈ పెనుగులాటలో మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనపర్తిలోని మార్కేండేయపురంలో వరలక్ష్మి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా నివాసం ఉంటున్న తేతల పుష్పావతి తెల్లవారుజామున లేచి వాకిలి శుభ్రం చేస్తుండగా దారిన వెళుతున్న వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేసిన పుష్పావతి అదుపుతప్పి మెట్లపై నుంచి కిందకు పడిపోవడంతో గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని గొలుసు విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని సీసీ పుటేజ్‌ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.

Updated Date - Feb 22 , 2024 | 01:40 AM

Advertising
Advertising