బూత్ కన్వీనర్లు బాధ్యతగా పనిచేయాలి
ABN, Publish Date - Feb 03 , 2024 | 12:38 AM
బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ, మన టీడీపీ, కుటుంబ సాధికార సారథులు, ఓటరు వెరిఫికేషన్ తదితర అంశాల గురించి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్‌చార్జిలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు కోరారు.
ఇంటిగ్రేటెడ్ శిక్షణా శిబిరంలో మాజీ మంత్రి గొల్లపల్లి
మామిడికుదురు, ఫిబ్రవరి 2: బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ, మన టీడీపీ, కుటుంబ సాధికార సారథులు, ఓటరు వెరిఫికేషన్ తదితర అంశాల గురించి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్‌చార్జిలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు కోరారు. మామిడికుదురులో శుక్రవారం జరిగిన ఇంటిగ్రేటెడ్ శిక్షణా శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా శ్రీనివాస్, మండలశాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, ఈలి శ్రీనివాస్, సాగి పాపయ్యరాజు, వర్ధినీడి బాబ్జి, చాగంటి స్వామి, లంకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మలికిపురం: శంకరగుప్తంలో సర్పంచ్, క్లస్టర్ ఇన్‌చార్జి రాపాక ఆనందకుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో మాజీమంత్రి గొల్లపల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బోళ్ల రాజేష్, బత్తుల గణేష్, పృథ్వి, బాలకృష్ణలు శిక్షణ ఇచ్చారు.ఎంపీపీ కేతా శ్రీనివాస్, చాగంటి స్వామి, యుగంధర్, నాగు, మునేశ్వరరావు పాల్గొన్నారు.
రాజోలు: శివకోటి గ్రామశాఖ అధ్యక్షుడు కడలి ఏడుకొండలు స్వగృహంవద్ద మండల టీడీపీ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్ అధ్యక్షతన మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పొదలాడలో సర్పంచ్ కడలి సత్యనారాయణ స్వగృహంవద్ద క్లస్టర్ ఇన్‌చార్జి పితాని సూరిబాబు అధ్యక్షతన రాజోలు, సోంపల్లి, పొదలాడ, తాటిపాక గ్రామాల్లో క్లస్టర్-9 శిబిరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ శిక్షణను బత్తుల గణేష్, గన్ని పృథ్వి, బొమ్ము బాలకృష్ణలు ఇచ్చారు. ఎంపీపీ కేతా శ్రీను, చాగంటి స్వామి, ఎంపీటీసీలు ఉండ్రు సూర్యారావు, బొడ్డు కృష్ణారావు, కాండ్రేగుల భవానీ, మట్టపర్తి లక్ష్మి, బేతినీడి శ్రీనివాస్, దుర్గాప్రసాద్, గోపి, కడలి వెంకటరమణారావు పాల్గొన్నారు.
అంతర్వేది: రామేశ్వరం గ్రామంలో క్లస్టర్ ఇన్‌చార్జి చెల్లింగి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన క్లస్టర్-1, 2 శిబిరాల్లో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ శిక్షణను బోళ్ల రాజేష్, బత్తుల గణేష్, గన్ని పృథ్వి, బొమ్ము బాలకృష్ణలు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, చెల్లింగి లీలాశ్రీనివాస్, చాగంటి స్వామి, యెనుముల రమణ, కడలి వెంకటరత్నం, పిండి సత్యనారాయణ, కౌరు శ్రీనివాస్, అంతర్వేదిపాలెం పుల్లయ్య, రాధాకృష్ణ, టీడీపీ నాయకులుపాల్గొన్నారు.
కేశవరం అభివృద్ధి టీడీపీదే ఘనత : ఎమ్మెల్యే వేగుళ్ల
మండపేట: మండలంలోని కేశవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వా నిదేనని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. కేశవరంలో గ్రావెల్ దోపిడీ 14ఎక రాలు గ్రావెల్ కొండ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సుమారు రెండున్నర నెలలు దోపిడీ చేసి రూ.30 కోట్లు దోచేశారన్నా రు. అక్కడ గ్రావెల్ తవ్వకాలు పరిశీలిద్దామని బయలుదేరితే పోలీసులు రానివ్వలేదు. ఎమ్మెల్సీ తోట టీడీపీ జనసేన వా ళ్లు కేశవరం వస్తే ఎమ్మెల్యే వేగుళ్లపై కోడిగుడ్లు, రాళ్లతో దా డి చేస్తారని బెదిరించారు. మండలంలోని కేశవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం స్దానిక నేతలతో కలిసివేగుళ్ల గ్రామం లో ఇంటింటా తిరిగి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను వివరించారు. ఆయన వెంట స్దానిక టీడీపీనేతలు కర్రి తా తారావు, కంటిపూడి శ్రీనివాసరావు, గారపాటిర శీను, మండల టీడీపీ అధ్యక్షుడు యరగతపు బాబ్జి పాల్గొన్నారు.
ఆలమూరు: మండలంలోని మూలస్థానఅగ్రహారంలో టీడీపీ కొత్తపేట నియోజకవర్గ యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో శుక్రవారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి కీ తిరిగి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఖాయమంటూ భవిష్యత్ కార్యాచరణ కరపత్రాలను ప్రజలకు అందించారు. టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
కె.గంగవరం: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మ డి ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఆయ న మండలంలోని కూళ్ల, నరజాడ, తమ్మయ్యపాలెం, నీలగి రిపేట గ్రామాల్లో పర్యటించారు. అలాగే పామర్రు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు టీడీపీ నాయకుడు డాక్టర్ కాదా వెంకటరమణ రూ.50వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్‌ను బహూకరించారు.
ఈతకోటను పారిశ్రామికవాడలా తీర్చిదిద్దుతా : బండారు
రావులపాలెం: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈతకోటను పారిశ్రామికవాడలా తీర్చిదిద్దుతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండా రు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం ఈత కోటలో శుక్రవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారం టీ కార్యక్రమం నిర్వహించారు. బండారు నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరించారు.
విద్యార్థీ మేలుకో... భవిష్యత్తును కాపాడుకో
టీడీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్‌రాజ్ ‘విద్యార్థీ మేలుకో... భవిష్యత్తును కాపాడుకో’ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Updated Date - Feb 03 , 2024 | 12:38 AM