ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి

ABN, Publish Date - Mar 03 , 2024 | 01:27 AM

గంజాయి తరలిస్తున్న ఇద్ద రు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ కేసీహెచ్‌ రామా రావు తెలిపారు. శ

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

గోపాలపురం, మార్చి 2: గంజాయి తరలిస్తున్న ఇద్ద రు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ కేసీహెచ్‌ రామా రావు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన సీకే గౌతమ్‌రాజ్‌, కేఎస్‌ వినయ్‌కుమార్‌ పువ్వుల వ్యాపారంలో నష్టం రావడంతో అధిక ధనార్జన కోసం గంజాయి వ్యాపారానికి తెరదీశారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం సాయంత్రం గోపాలపురం మండలం జగన్నాధపురం శివారులో ఏర్పాటుచేసిన బోర్డరు చెక్‌పోస్టు వద్ద దేవరపల్లి సీఐ బాలసురేష్‌బాబు, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 4.290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

చోరీ కేసులో నిందితుల అరెస్టు

తెలంగాణ రాష్ట్రం ములుగుజిల్లా మంగపేట గ్రామం దేవత హనుమంత రావు అపరాల వ్యాపారం చేస్తుంటాడు. అతడి వద్ద తెలంగాణకు చెందిన బైట్ల సాయి బాబా 20 ఏళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా సాయిబాబా తరచూ అపరాలు కాకినాడ తీసుకెళ్లి అమ్ముతుంటాడు. అక్కడ అపరాలు అమ్మిన సొమ్ము రూ.7,45,000 బ్యాగులో పెట్టుకుని గత నెల 29వ తేదీన బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగాడు. అక్కడ సాయిబాబాకు గతంలో పరిచయం ఉన్న అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట గ్రామానికి చెందిన ఏర్నేటి విజయకుమారి, ఆమె మేనల్లుడు మాడా మణికుమార్‌ తారసపడ్డారు. తాము కూడా తెలంగాణ వస్తున్నామని చెప్పి సాయిబాబాతో పాటు రాజమండ్రి లో బస్సు ఎక్కారు. గోపాలపురం చెక్‌పోస్టు సెంటర్‌కి వచ్చేసరికి సాయిబాబా నిద్రపోతున్న సమయంలో ఇద్దరూ సొమ్ము ఉన్న బ్యాగును దొంగిలించి బస్సు దిగి పారిపోయారు. మెలకువ వచ్చి చూడగా సాయిబాబా దగ్గర సొమ్ములున్న బ్యాగ్‌ కనిపించకపోవడంతో గో పాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు దేవరపల్లి సీఐ బాలసురేష్‌బాబు, ఎస్‌ఐ కె.సతీష్‌ కుమార్‌ మండపేట వెళ్లి విజయకుమారి, మణికుమా ర్‌లను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.7,45,000 రికవరీ చేశారని, వారి వెంట హెడ్‌కాని స్టేబుల్‌ సత్యానందం, పోలీస్‌ సిబ్బంది ఉన్నారని డీఎస్పీ రామారావు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 01:27 AM

Advertising
Advertising