ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పత్తి ధర పైపైకి

ABN, Publish Date - Feb 20 , 2024 | 11:56 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని యార్డులో విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

క్వింటాలు రూ.7419

ఆదోని (అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 20: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గరిష్టంగా పత్తి ధర క్వింటాలు రూ.7419 పలికింది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతులు పత్తి ధరల కోసం వేచి చూసి ధరలు పెరగకపోవడంతో 90 శాతం మంది విక్రయించుకున్నారు. పత్తి విక్రయాలు పేలవంగా సాగుతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో డిమాండ్‌ పెరిగింది. దీంతో పత్తికి డిమాండ్‌ పెరిగి ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ దూది ధరలు స్వల్పంగా పెరిగాయని తెలిపారు. వారం రోజుల్లో పోల్చితే పత్తి ధర క్వింటానికి రూ.400 పైగా పెరిగింది. పత్తి విక్రయించుకున్నాక ధరలు పెరగడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. 1,082 క్వింటాలు పత్తి మార్కెట్‌ యార్డుకు విక్రయానికి రాగా, క్వింటాలు గరిష్టంగా రూ.7,419, కనిష్టంగా రూ.4,687, మధ్యఽస్థ ధర రూ..6,969 పలికింది.

Updated Date - Feb 20 , 2024 | 11:56 PM

Advertising
Advertising